Propose Day 2022: ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. ఈ రోజున మీ ప్రేమను అసలు మిస్ కావొద్దు!

Propose Day 2022: వాలెంటైన్ వీక్ లో రెండో రోజును ప్రపోజ్ డే గా ప్రేమికులు జరుపుకొంటారు. ఈ వాలెంటైన్ వీక్ లో ఇదే ముఖ్యమైన రోజు. ఎందుకంటే తాము ఇష్టపడే వ్యక్తులకు ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అయితే ఈ ప్రపోజ్ డే కు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 01:21 PM IST
    • వాలెంటైన్ వీక్ రెండో రోజు ప్రపోజ్ డే
    • ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ రోజు ప్రత్యేకం
Propose Day 2022: ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. ఈ రోజున మీ ప్రేమను అసలు మిస్ కావొద్దు!

Propose Day 2022: ఆధునిక కాలంలోని నేటి కొత్త తరం వాలెంటైన్స్ వీక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వారం ఫిబ్రవరి 7న మొదలై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 8న.. వాలెంటైన్ వీక్ లోని రెండో రోజును Propose Dayగా ప్రేమికులు జరుపుకొంటారు. 

వాలెంటైన్ వీక్ లో తొలి రోజు Rose ఇచ్చి ప్రేమను వ్యక్తపరిచి.. ఆ తర్వాత రోజు తమలోని ప్రేమను బాహాటంగా చెప్పేందుకు ఈ రోజు (ఫిబ్రవరి 8) ప్రసిద్ధి. అయితే వాలెంటైన్ డే వీక్ లో రెండో రోజును Propose Dayగా జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 

Propose Day ఎందుకు జరుపుకొంటారు?

వాలంటైన్ డే వీక్ లో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమైంది. తొలి రోజు Rose Day, రెండో రోజును Propose Dayగా ప్రేమికులు జరుపుకొంటారు. తమ మనసులోని ప్రేమను ఈ రోజు వ్యక్తపరిచేందుకు చాలా మంది ప్రేమికులు ఇష్టపడతారు. 

ప్రపోజ్ డే ఎందుకు ప్రత్యేకం?

Propose Day అనేది జంటలకు మాత్రమే ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున వారు ఒకరికొకరు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తారు. ఈ రోజు చాలా కొత్త జంటలు ఏర్పడతాయి. ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇష్టాన్ని వ్యక్తం చేయకపోతే.. ఈ రోజు మీరు ప్రేమించే వ్యక్తికి మీ ప్రేమను తెలియజేస్తే మంచిది. 

ప్రపోజ్ డే ను ప్రేమికులు చాలా ఉత్సాహంగా జరుపుకొంటారు. ఈ రోజు కొత్త జంటలకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు, అయితే ఇప్పటికే జంటలుగా మారిన వారు కూడా ప్రపోజ్ డే రోజున తమ తమ ప్రేమను మరోసారి మీ ఇష్టమైన వారికి వ్యక్తపరచవచ్చు. అలా చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. 

ప్రేమను ఎలా వ్యక్తపరచాలి?

'ప్రపోజ్ డే' సందర్భంగా, మీరు మీ ప్రియమైన వ్యక్తి కోసం ఒక అందమైన ప్రదేశంలో సర్ ప్రైజ్ ప్లాన్ చేయండి. ప్రపోజ్ డే కు గుర్తుగా ఏదైనా చిరుకానుక గిఫ్ట్ గా ఇవ్వండి. మీ భాగస్వామికి తమ కంటే ఏది ఎక్కువ కాదని భావించేలా ఏదైనా చేయండి.  

Also Read: Valentines Day: వాలెంటైన్ డే అంటే ఒక్కరోజే కాదు..వారం రోజుల వేడుక, అవేంటో చూద్దామా

Also Read: Valentine Week 2022: వాలెంటైన్ వీక్ లో తొలి రోజు Rose Dayగా ఎందుకు జరుపుకొంటారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News