Diabetes New Symptoms: డయాబెటిస్ వ్యాధి ప్రాణాంతకమైందని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలామంది మన దేశంలో డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో నిత్యం బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమందిలో అయితే చిన్న గాయం తగిలితే అది విషపూరితంగా మారి పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొంతమందిలో కంటి బలహీనత ఏర్పడి గుండెపోటు సమస్యలకు కూడా కారణమవుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది మధుమేహం ఉన్నవారిలో ప్రారంభ దశలో అలసట, దాహం, బలహీనత, అధిక మూత్రవిసర్జన వంటి సంకేతాలు కనిపిస్తాయి. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బలహీనమైన కంటిచూపు:
రక్తంలో చక్కెర పరిమాణాలు ఎక్కువగా అయినప్పుడు.. రక్తనాళాలు ప్రభావితమవుతాయి. దీనివల్ల కళ్లకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. మధుమేహంతో బాధపడుతున్న కొంతమందిలోనైతే..చూపు తగ్గడం, కంటిశుక్లం, గ్లాకోమా వంటి సమస్యలు మొదలవుతాయి
గొంతు చిగుళ్ళు:
రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే చిగుళ్లలో నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా నోటిలోని చిగుళ్ళకు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఈ కారణంగా తీవ్ర నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
పాదాలలో సంకేతాలు:
డయాబెటిస్తో బాధపడుతున్న వారికి పాదాల్లో కూడా గాయాలవుతాయి. ఇలాంటి సమస్యలు తలెత్తితే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా డయాబెటిస్తో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మూత్రపిండాల సమస్యలు:
షుగర్ పెరగడం వల్ల కిడ్నీలో సమస్య వస్తాయి. నిజానికి కిడ్నీలు మన శరీరంలోని రక్తంలో టాక్సిన్స్‌ని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగినప్పుడు చాలామందిలో మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి.
అధిక రక్త పోటు:
మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో అధిక బీపీ సమస్యలు రావడం సర్వసాధారణం. ప్రస్తుతం చాలామందిలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారంపై పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి.)
Also Read: IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు
Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook