Cucumber Benefits: మీ బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణకు ఆ ఒక్కటీ చాలు

Cucumber Benefits: మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఒక వస్తువుతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 26, 2022, 10:54 PM IST
Cucumber Benefits: మీ బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణకు ఆ ఒక్కటీ చాలు

మధుమేహం అతి ప్రమాదకరం. అప్రమత్తంగా ఉంటే నియంత్రణ సాధ్యమే కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని సులభమైన చిట్కాలతో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కీరాలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ప్రతి సీజన్‌లో లభిస్తుంది. కీరా రోజూ తింటే శరీరంలో ఫ్రెష్‌నెస్ వస్తుంది. కడుపుకు చలవ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి, కేశాలకు చాలా ప్రయోజనకరం. కీరాను డైట్‌లో భాగంగా చేసుకుంటే..చాలా లాభాలుంటాయి. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కీరాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. 

1. కీరాను సూప్‌లా చేసుకుని రోజూ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభదాయకం. కీరా సూప్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. కీరాను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. రోజుకు ఒక కీరా తింటే అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి.

2. ముఖంపై ముడతల సమస్యతో బాధపడేవారికి కీరా మంచి ప్రత్యామ్నాయం. కీరా గింజలు సౌందర్య పరిరక్షణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటివల్ల సన్‌బర్న్, డ్రై స్కిన్, ట్యానింగ్ సమస్యలు దూరమౌతాయి.

3. కీరా కళ్లకు చాలా మంచిది. కీరా వల్ల కంటి వెలుగు మెరుగవుతుంది. స్లైసెస్‌గా కోసుకుని కళ్ల కింద పెట్టుకుంటే..డార్క్ సర్కిల్స్ దూరమౌతాయి. కీరా తినడం వల్ల అలసట తగ్గుతుంది. కళ్లకు సహజసిద్ధమైన ఉపశమనం కలుగుతుంది. కేశాల్ని పటిష్టం చేస్తుంది కూడా.

Also read: Horse Gram for Weight Loss: మధుమేహం, గుండె సమస్యలకు ఇలా 15 రోజుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News