Homemade Packs: మెడ మీద ముడతలతో బాధపడుతున్నారా..అయితే ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి.!!

Homemade Packs: మారతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చర్మంపై  ముడతలు సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో ముడతలు రావడం సహజం. ప్రస్తుతం యువత యవ్వన వయసులో కూడా  ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 11:28 AM IST
  • మెడ మీద ముడతలతో బాధపడుతున్నారా
  • ఇంటి చిట్కాలతో నయం చేసుకోండి
  • మెడపై ముడతలు పోగొట్టుకోవడానికి ఇంట్లో వస్తువులతో ప్యాక్
Homemade Packs: మెడ మీద ముడతలతో బాధపడుతున్నారా..అయితే ఈ ఇంటి చిట్కాలను  ట్రై చేయండి.!!

Homemade Packs: మారతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చర్మంపై  ముడతలు సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో ముడతలు రావడం సహజం. ప్రస్తుతం యువత యవ్వన వయసులో కూడా  ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే వైద్య నిపుణులు  చర్మంపై వృద్ధాప్య సంకేతాల వేగాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. చర్మానికి సరైన పోషకాహారం అందితే చర్మంపై గ్లో ఎక్కువ కాలం ఉంటుందని,  ముడతలు కూడా కనిపించవని వారు తెలుపుతున్నారు.

మెడపై కూడా చర్మం ముఖం వలె మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కావున వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మెడపై ముడతలను తొలగించేందుకు అనేక ఇంటి  చిట్కాలు  ఉన్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వాలేక పోతున్నాయి. ముడతలు పడకుండా ఉండేందుకు  ఇంట్లో తయారు చేసుకున్న ప్యాక్‌ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

మెడపై ముడతలు పోగొట్టుకోవడానికి ఇంట్లో వస్తువులతో ప్యాక్:

కలోంజి ఆయిల్ :

కలోంజి ఆయిల్ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. ఈ ఆయిల్‌ను మెడపై 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇది మెడపై ఉండే  వృద్ధాప్య చర్మం నుంచి రక్షిస్తుంది.

గుడ్డులోని తెల్లసొన:

మెడపై ముడతలు పోవడానికి గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొటీన్, అల్బుమిన్ పుష్కలంగా ఉంటాయ. ఇది స్కిన్ టోనింగ్ మారడానికి సహాయపడుతుంది.ఈ చిట్కా కోసం ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన భాగాన్ని తీసి అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. మెడపై అప్లై చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేసిన తర్వాత శుభ్రం చేయండి.

ఆపిల్ వెనిగర్:
 
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఇవి మెడపై ఫైన్ లైన్స్, ముడతలను తగ్గిస్తాయి. యాపిల్ వెనిగర్‌లో ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ కూడా అధికంగా ఉంటాయి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించి కొత్త చర్మం వచ్చేందుకు సహాయపడుతుంది.

పప్పుల వాడకం:

పప్పుల వాడకం చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా చేస్తాయి. అరకప్పు పప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం వడగట్టి మిక్సీ గ్రైండర్‌లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌కి టొమాటో రసం కలిపి పేస్ట్‌లా చేసి మెడకు అప్లై చేయాలి.

బియ్యం పిండి ఉపయోగించి హోమ్ మేడ్ ప్యాక్:

ఈ హోమ్ మేడ్ ప్యాక్ కోసం ముందుగా..రోజ్ వాటర్‌లో బియ్యప్పిండిని బాగా కలపి పేస్ట్ చేయండి. ఇప్పుడు దానితో మెడకు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Coriander Seeds Water Benefits: కొత్తి మీర గింజలతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా..?

Also Read: Wood Apple Benefits: మారేడు పండుతో శరీరాని ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News