Kidney Health: వర్షాకాలం వాతావరణంలో చాలా రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా తేమలో వివిధ రకాల మార్పులు సంభవిస్తాయి. దీని ప్రభావం మనుషులపై పడే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ వాతావరణంలో తాగునీరు కలుషితం కావడం వల్ల మూత్రపిండాలు, కాలేయంపై త్రీవ ప్రభావవం పడి.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా పచ్చకామెర్లకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యల బారిన పడకుండా కచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
మూత్రపిండాలు, కాలేయం చెడిపోవడం వల్ల అది మన శరీరం సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వానా కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ముఖ్యంగా పచ్చకామెర్ల సమస్య వల్ల ప్రాణాతంకంగానూ మారే అవకాశాలున్నాయి. అయితే ఆయుర్వేద శాస్త్రంలో కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి.. కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి పలు రకాల పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పచ్చకామెర్లు వ్యాధికి శాస్త్రం సూచించిన పలు రకాల మూలికలను వాడానికి పేర్కొంది. వానా కాలంలో మాత్రం ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండడానికి కచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పసుపు:
పసుపును ఓ ఆయుర్వేద మూలికగా వినియోగిస్తారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్‌ల పరిమాణం అధికంగా ఉంటుంది. కావున శరీరంలోకి వెళ్లి వాపు, నొప్పిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించేందుకు దోహదపడుతుంది. అయితే దీనిని ఆహారంగా చట్నీలో వేసుకుని తీసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీ సమస్యలు దూరమవుతాయి.
ముఖ్యంగా ఇందులో కామెర్లతో వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కావున ఈ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వీటితో చేసిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం:
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి అల్లం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ టీలో అల్లం మిక్ తాగితే కిడ్నీలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా చట్నీ, పప్పు, కూరగాయలు మొదలైన వాటిలో అల్లం వాడండం వల్ల పచ్చకామెర్లు సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read: PM Modi and Pak Sister: ప్రధాని మోదీకు 25 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్తాన్ చెల్లెలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook