Kesar For Skin: కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి.. మిళమిళలాడడం ఖాయం..

Kesar For Skin: కుంకుమపువ్వులో పోషక విలువలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని పాలలో కలుపుకుని తాగితే శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 01:59 PM IST
Kesar For Skin: కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి.. మిళమిళలాడడం ఖాయం..

Kesar For Skin: కుంకుమపువ్వులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే పోషక గుణాలు చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది శీతాకాలంలో చర్మ సమస్యలతో బాధపడతారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల చర్మంపై చాలా రకాల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొండానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.

సౌందర్య సాధనాలకు బదులుగా నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలతో సులభంగా చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా చర్మాన్ని కంతివంతంగా తయారు చేసుకోవడానికి కుంకుమపువ్వుతో చేసిన ఫేస్‌ ఫ్యాక్‌ను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మంపై సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.

కుంకుమపువ్వు ప్రయోజనాలు:
పరిశోధన ప్రకారం.. కుంకుమపువ్వు చర్మాన్ని మృదువుగా, తేమగా మార్చడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిని పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కుంకుమపువ్వు సోరియాసిస్, ఎగ్జిమా, మొటిమల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

కాంతివంతమైన చర్మం కోసం:
కుంకుమపువ్వు ముఖం రంగును ప్రకాశవంతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ముఖంపై చర్మంపై రంగును మార్చి.. అందంగా చేయాడానికి సహాయపడుతుంది. కాబట్టి దీనిని పాలలో ప్రతి రోజూ కలుపుకుని తాగితే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

మరకలను తొలగిస్తుంది:
కుంకుమపువ్వు చర్మంపై మరకలను తొలగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చర్మన్ని శుద్ధి చేసి మరకల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి కుంకుమపువ్వును ప్రతి రోజూ పాలలో వేసుకుని తాగండి.

మొటిమలు దూరమవుతాయి:
కుంకుమపువ్వు మొటిమల సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర మొటిమల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పాలతో తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు

Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News