ఇండియాలో అత్యధిక దూరం ప్రయాణించే బస్సు సర్వీస్

సాధారణంగా ఎవరైనా సుదూర ప్రయాణాలకు సిద్దమైతే రైళ్లను ఆశ్రయిస్తారు.. బస్సు ఆశ్రయించడం చాలా అరుదు. 

Last Updated : Jan 21, 2018, 09:35 AM IST
ఇండియాలో అత్యధిక దూరం ప్రయాణించే బస్సు సర్వీస్

సాధారణంగా ఎవరైనా సుదూర ప్రయాణాలకు సిద్దమైతే రైళ్లను ఆశ్రయిస్తారు.. బస్సు ఆశ్రయించడం చాలా అరుదు. కానీ ఇప్పుడు ఈ సమస్యలేదులేండీ..! సరికొత్త టెక్నాలజీతో, సౌకర్యాలతో, హంగులతో అందుబాటులోకి వచ్చిన వోల్వో బస్సులు సుదూర గమ్యస్థానాలకూ ప్రయాణీకులను చేరుస్తున్నాయి. ఇదివరకు ఉత్తర భారతదేశం వెళ్ళవలసి వస్తే.. రైలు ఎక్కి వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారత దేశాన్ని కలుపుతూ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి.  

బెంగళూరుకు చెందిన విఆర్ఎల్ లాజిస్టిక్స్ అనే బస్సు సర్వీస్, బెంగళూరు నుండి జోద్పూర్ (రాజస్థాన్)కు వోల్వో బస్సు నడుపుతోంది. ఇదొక్కటే కాదు ఈ మార్గం గుండా సుమారు మరో ఐదు బస్సు సర్వీసులు ఉన్నాయి.  జఖర్ ట్రావెల్స్-1, ఎంఆర్ ట్రావెల్స్ సర్వీస్-3, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్-1 బస్సులను నడుపుతున్నాయి.  భారత దేశంలో ఇదే అత్యధిక దూరం ప్రయాణించే బస్సు సర్వీస్. ఈ బస్సు కర్ణాటకలోని బెంగళూరు నుండి రాజస్థాన్ లోని జోద్పూర్ వరకు సుమారు 1935 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది బెంగళూరు, అహ్మదాబాద్ మరియు జైపూర్ మీదుగా జోద్పూర్ చేరుకుంటుంది. ప్రయాణ సమయం 36 గంటలు. పేటియం ద్వారా లేదా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధర రూ.2000 నుండి 3500 వరకు ఉంటుంది. 

Trending News