Tomato Chutney Andhra Style: టమోటో నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం ఎంతో సులభం.. మీరు కూడా ట్రై చేయండి ఇలా!

Andhra Tomato Chutney: టొమాటో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే టొమాటో కూరలు మాత్రమే కాకుండా ఆంధ్ర స్టైల్‌లో టొమాటో తొక్కు చేసుకొని తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుందని ఆహార ప్రియులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2024, 10:34 PM IST
Tomato Chutney Andhra Style: టమోటో నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం ఎంతో సులభం.. మీరు కూడా ట్రై చేయండి ఇలా!

Andhra Tomato Chutney: మనం టమాటో లను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే వీటితో కూర్రలు చేస్తాము. కానీ ఆంధ్ర స్టైల్‌లో తయారు చేసే టమాటో తొక్కు ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని అన్నం, ఇడ్లీ, దోసెలలో కూడా తీసుకోవచ్చు. ఈ టమాటో తొక్కు అనేది వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టం తింటారు. అయితే ఈ టమాటో తొక్కు ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

టమాటో తొక్కుకి కావాల్సిన పదార్థాలు: 

*  పండిన టమోటాలు - 1/2 

* నెయ్యి - ఒక టేబుల్ స్పూన్ 

* ఆవాలు - 1/4 టేబుల్ స్పూన్ 

* పొట్టు తీసిన అల్లం -   పావు

* కాశ్మీరీ చిల్లీ పౌడర్ - మూడు టేబుల్ స్పూన్లు

* ఆవాల పొడి - 1/2 టేబుల్ స్పూన్ 

* మెంతిపొడి - 1/4 టేబుల్ స్పూన్ 

* ఇంగువ - చిటికెడు

* పసుపు పొడి - 1/4   టేబుల్ స్పూన్ 

* ఉప్పు 

* బెల్లం - ఒక టేబుల్ స్పూన్ 

 * ఆవాలు - 1/4  టేబుల్ స్పూన్ 

 * కరివేపాకు

 * ఎండు మిర్చి- రెండు 

 * వెల్లుల్లి పాయలు- నాలుగు

 * మేతి పౌడర్ -  చిటికెడు 

టమాటో తొక్కు తయారు చేసే విధానం: 

ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి టేబుల్‌స్పూను నూనె పోసి వేడయ్యాక అందులో 1/4 టీస్పూన్ ఆవాలు,   అల్లం వేసి బాగా వేగించుకోవాలి. తర్వాత టొమాటోలు, ఉప్పు వేసి మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి. తర్వాత మూత పెట్టి టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టొమాటోలు వేగిన తర్వాత అందులో బెల్లం, పసుపు, కారం, ఆవాల పొడి, మెంతిపొడి వేసి బాగా వేయించాలి.  ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి, పచ్చి వాసన పోయే వరకు తక్కువ మంట ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.  

 తర్వాత ఓ పాన్ పెట్టి ఓవెన్‌లో పెట్టి అందులో మసాలా కోసం ఇచ్చిన నూనె మొత్తం పోసి అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంగువ పొడి వేసి తాలింపు వేసుకోవాలి.  చల్లార్చి టమోటో తొక్కులో వేసి మొత్తం బాగా కలియ తిప్పి గాలి చొరవడని గాజు సీసాలో వేయాలి.  ఈ టొమాటో గుజ్జును ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల వరకు బాగుంటుంది.

Also read: Ragi Sangati: రుచికరమైన రాగి ముద్దని ఇలా తయారు చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News