Ragi Sangati: రుచికరమైన రాగి ముద్దని ఇలా తయారు చేసుకోండి

Ragi Sangati Mudda:  రాగి ముద్ద తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ప్రతిరోజు ఈ రాగి ముద్దని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 11:34 PM IST
Ragi Sangati: రుచికరమైన రాగి  ముద్దని ఇలా తయారు చేసుకోండి

Ragi Sangati Mudda: రాగులు శరీరానికి  ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రాగులతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారు. అంతేకాకుండా ఇందులో అనేక రకమైన పోషకలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా తగ్గుతాయి. మీరు రాగులతో దోస, లడ్డు, ముద్ద తయారు చేసుకొని తినడం వల్ల శరీరం ధృడంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు రాగి ముద్ద తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా దీనిని ఎన్ని కూరలతో పాటు కలిపి తినవచ్చు.  ఇలా చేయడం వల్ల శరీరంలో వచ్చే అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. అంతేకాకుండా కీళ్లు నొప్పులు , కడుపు నొప్పి, అలసట, బలహీనత వంటి సమస్యలు మాయం అవుతాయి. అలాగే మీరు కూడా ఈ ముద్ద ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.

రాగి సంగ‌టి ముద్ద త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

రాగి పిండి, బియ్యం, ఉప్పు

రాగి సంగ‌టి ముద్దను త‌యారు చేసే విధానం:

ముందుగా నీటిలో బియ్యాన్ని పోసి ఉడికించుకోవాలి. రాగి పిండిని కొద్దిగా నీటిలో క‌లుపుకుని పెట్టుకోవాలి.  ఉడికిన బియ్యంలో పిండిని పోస్తూ ఉండ‌లు లేకుండా క‌ల‌పాలి. ఉప్పు స‌రిప‌డా వేసుకుని కొద్దిసేపు ఉడికించాలి. ఉడికిన త‌రువాత ముద్దలుగా చేసుకోవాలి. దీంతో రాగి సంగ‌టి ముద్దలు త‌యార‌వుతాయి. వీటిని ఏ కూర‌తో తిన్నా స‌రే రుచిగా ఉంటాయి.  రాగి ముద్ద తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఎముకలు, రోగనిరోధకశక్తి మెరుగుపడుతాయి. పిల్లలకు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మీరు ఈ రాగి ముద్దని వారికి తినపించడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వారు శక్తివంతంగా తయారు చేయడంలో రాగి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ప్రతిరోజు ఈ రాగి ముద్దని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also read: Interview Tips: ఇంటర్వ్యూలో ఏయే పొరపాట్లు చేయకూడదు, ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Jaggery Laddu With JaggeryBesan Ladoo With JaggeryBest Jaggery Ladoo Recipe

Trending News