Milk: చల్లని వాతావరణంలో..  పచ్చి పాలు ఇలా వాడితే చర్మం పట్టులా మెరిసిపోవడం ఖాయం..

Milk In Winter Skincare: చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది జీవం లేకుండా పోతుంది ఇతర సమస్యలు వస్తాయి అయితే చలికాలం పూట ముఖానికి సరైన స్కిన్ కేర్ తీసుకోవాలి ఇలా చేయటం వల్ల చర్మం మెత్తగా మృదువుగా మారుతుంది ఎలాంటి ఇతర సమస్యలు రావు.

Written by - Renuka Godugu | Last Updated : Nov 9, 2024, 05:54 PM IST
Milk: చల్లని వాతావరణంలో..  పచ్చి పాలు ఇలా వాడితే చర్మం పట్టులా మెరిసిపోవడం ఖాయం..

Milk In Winter Skincare: చలికాలం ఇంట్లోనే కొన్ని రకాల ఇంటి చిట్కాలతో స్కిన్ కేర్ రొటీన్ ప్రారంభించవచ్చు. దీంతో మీ చర్మం సమస్యలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి ఇవి సహజ సిద్ధమైనది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.చలికాలం సరైన స్కిన్ కేర్ రొటీన్ లో పాలను ముఖ్యంగా చేర్చుకోవాలి ఎందుకంటే ఇందులో విటమిన్ డి ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. సరైన లో కూడా పొందుతారు పాలతో మీ చర్మాన్ని ఎలా మెరిపించుకోవచ్చో తెలుసుకుందాం.

పాలలో గ్లిజరిన్ కలిపి ముఖానికి కాటన్ బాల్ తో అప్లై చేసుకోవచ్చు దీని అలాగే కాసేపు మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత 20 నిమిషాలు ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి మారైనా చర్మానికి చెక్ పెట్టవచ్చు మీ ముఖం కూడా మెరిసిపోతుంది. పాలు ముఖానికి సహజసిద్ధమైన  సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాదు పాలను ముఖానికి ఇలా ఉపయోగించడం వల్ల ముఖానికి మంచి మాయిశ్చరైజర్ అందుతుంది. ముఖం పొడిబారటం చలికాలంలో సాధారణం దీనివల్ల దురద వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

అంతేకాదు, శనగ పిండి లేదా బియ్యం పిండిలో పాలను కలిపి ముఖానికి ఫేస్‌ ప్యాక్‌వ వంటివి చలికాలంలో వేసుకోవాలి. దీని వల్ల కూడా మీ చర్మం మెరుస్తుంది. మాయిశ్చర్‌ నిలుపుకుంటుంది.

 ఇతర చర్మ సమస్యలు ప్రారంభమవుతాయి పచ్చి పాలను ఉపయోగించడం వల్ల ఇది ఎఫెక్ట్ రెమెడీగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన చర్మానికి కావలసిన పోషణ అందిస్తాయి. ఇలా తరచూ పాలను ఉపయోగించటం వల్ల వృద్ధాప్య సమస్యలు కూడా త్వరలో కనిపించవు. పాలలో ఉండే విటమిన్ ఏ, బి వల్ల మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. నేచురల్ గా మెరుస్తారు. స్కిన్ కే రోటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఇది మంచి న్యాచురల్ లా కూడా పనిచేస్తుంది, ముఖంపై వ్యర్థాలను తొలగిస్తుంది.

ఇదీ చదవండి:  ఈ 4 గింజలు నానబెట్టి ఉదయం పరగడపున తింటే నిత్య ఆరోగ్యం.. శక్తి రెట్టింపు..

పచ్చి పాలతో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది ముఖంపై ఉన్న మంగు మచ్చలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు రోజంతా నీ ముఖంపై పేరుకున్న జిడ్డును కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. చలికాలంలో సరైన స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవాలి లేకపోతే చర్మం పొడిబారుతుంది. పచ్చిపాలను ఉపయోగించటం వల్ల ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎందుకంటే కెమికల్ ఏవి ఇందులో ఉండవు కాబట్టి పచ్చి పాలను మీరు గ్లోయింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో చేర్చుకోవాలి. పచ్చి పాలు జిడ్డు చర్మం ఉన్నవారు వాడకపోవడం మేలు. ఎందుకంటే చర్మం మరింత జిడ్డుగా కనిపిస్తుంది. ఏవైనా ఫేస్‌ ప్యాక్‌లు వేసుకోవాలంటే జిడ్డు చర్మం ఉన్నవారు పాలకు బదులు రోజ్‌ వాటర్‌ మిక్స్‌ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: గుండె ఆరోగ్యానికి నాలుగు.. ఇక మీ హృదయం జీవితాంతం ఆరోగ్యం..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News