Dry Fruits for Healthy Life: రాత్రి నానబెట్టిన గింజలను ఉదయం తీసుకోవటం వల్ల ఈ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీకు రావు ఎందుకంటే ముఖ్యంగా బాదం, వాల్నట్స్, జీడిపప్పు తీసుకోవటం వల్ల మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం పరగడుపున ప్రతిరోజు తీసుకోవాల్సిన నాలుగు డ్రైఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.
పిస్తా..
ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మెరుగైన లాభాలు కలుగుతాయి. రాత్రి పడుకునే ముందు పిస్తాలను నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో జియాన్తిన్, లుటీన్ ఉంటుంది. ఇది ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాదు పిస్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి ప్రతిరోజు ఉదయం పరగడుపున పిస్తాలు తీసుకోవడం వల్ల మీ దరికి ఎలాంటి రోగాలు చేరవు.
ఖర్జూరం..
ఖర్జూరం డైట్ లో చేర్చుకోవాలి ఇందులో కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు ఉంటాయి. ఆడవారికి కూడా ఎంతో ఉపయోగం, సీజనల్ వ్యాధుల నుంచి కాపాడే శక్తి ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఖర్జూరం మలబద్ధక సమస్య కూడా చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల పేరు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
ఇదీ చదవండి: గుండె ఆరోగ్యానికి నాలుగు.. ఇక మీ హృదయం జీవితాంతం ఆరోగ్యం..!
వాల్ నట్స్..
వాల్నట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాల్నట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇందులో విటమిన్స్, ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె సమస్యలను దూరంగా ఉంచుతాయి. వాల్నట్స్ లో పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సంబంధించి వ్యాధులకు చెక్ పెడుతుంది. అంతే కాదు ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగకుండా కాపాడతాయి. ఇందులో ఉండే అమైనో ఆసిడ్స్ మన శరీరానికి ఎంతో ముఖ్యం.
ఇదీ చదవండి: మీ శరీరంలో ఈ 4 భాగాల్లో నొప్పి ఉంటే.. అది కచ్చితంగా హార్ట్ఎటాక్‌కి దారితీస్తుంది..
బాదాం..
బాదం లో మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటికి పంపించేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇందులో ఉండే ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొటాషియం పుష్కలంగా ఉండే బాదం రాత్రి నానబెట్టు ఉదయం తొక్క తీసి తినాలి. ఇలా ప్రతిరోజు మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు ముఖ్యంగా ఈ గింజలు చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల ప్రాణాంతక సీజనల్ జబ్బులను కూడా ఈజీగా బయటపడవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.