Mustard Seeds: ఆవాలతో ఇలా చేస్తే... దురదృష్టం మీ దరి చేరదు...

Benifits of Mustard Seeds: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు... పలు రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం నుంచి బయటపడి అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఆవాలతో నరదిష్టిని కూడా ప్రారదోలవచ్చు. ఆ రెమెడీ ఎలానో ఇక్కడ తెలుసుకోండి...

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 08:53 PM IST
  • ఆవాలతో అనేక ప్రయోజనాలు
  • మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం నుంచి బయటపడవచ్చు
  • నరదిష్టి కూడా మీకు తగలకుండా చేస్తుంది
 Mustard Seeds: ఆవాలతో ఇలా చేస్తే... దురదృష్టం మీ దరి చేరదు...

Benifits of Mustard Seeds: ఆవాలను పలు రకాల మసాలాలు, పచ్చళ్ల తయారీలో ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. ఆవాలలో పోషక విలువలే కాదు... ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వంటల్లో ఆవాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు... పలు రకాల సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం నుంచి బయటపడి అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఆవాలతో నరదిష్టిని (Evil Eye) కూడా ప్రారదోలవచ్చు. ఆ రెమెడీ ఎలానో తెలుసుకోండి...

దురదృష్టాన్ని ప్రారదోలేందుకు ఆవాలు :

ఒక కుండలో నీటిని నింపి... అందులో ఆవాలు (Mustard Seeds Benifits) వేయండి. కాసేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం దూరమవుతుంది. ఇకముందు దురదృష్టం మీ దరి చేరకుండా ఉంటుంది. డబ్బు కొరత వంటి సమస్యలను అధిగమిస్తారు. పైగా, ఆవాల వల్ల ఆ నీటికి ఔషధ గుణం చేరుతుంది. తద్వారా మీరు వ్యాధుల బారినపడకుండా ఉంటారు.

నరదిష్టి నివారణకు :

ఏడు ఆవ గింజలు, సైంధవ లవణం, ఏడు ఎర్ర మిరపకాయలు... ఈ మూడింటిని ఎడమ చేతి గుప్పిట్లో పట్టుకుని... వ్యక్తి తల చుట్టూ తిప్పాలి. ఆ తర్వాత మామిడి చెక్కలతో వెలిగించిన మంటలో ఆ మూడింటిని వేయాలి. ఇలా చేయడం ద్వారా నరదిష్టి తొలగిపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు పదేపదే చిరాకు పడటం చేస్తుంటే ఈ ట్రిక్‌ను ఫాలో అవండి. ఇక గురువారం రోజు ఆవాలను (Mustard seeds) దానం చేయడం చాలామంది శుభప్రదంగా భావిస్తారు. అలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తీరుతాయని కూడా విశ్వసిస్తారు.

Also Read: Viral Video: బాక్సింగ్ రింగ్‌లో ఇద్దరు పొలిటిషియన్లు తలబడితే ఎలా ఉంటుంది-ఇదిగో ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News