Split Ends Hair Home Remedies: ప్రతి అమ్మాయి తన జుట్టును అందంగా, పొడవుగా పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తూ ఉంటారు. కానీ ఆధునకి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా మందిలో జుట్టు జుట్టు చిట్లడంతోపాటు జుట్టు చివరలో పీచులాగా తయారవుతోంది. దీంతో చాలా మంది జుట్టును కత్తిరంచడం వంటివి చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలున్నవారు ఇక నుంచి ఇలా చేయ్యనక్కర్లేదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు చివరి భాగాల్లో కూడా బలంగా తయారై, చిట్లిపోవడం తగ్గుతుంది.
ఇలా చేస్తే చిట్లిపోయిన జుట్టు దూరమవుతుంది:
ఎక్కువగా నీటిని తాగండి:
నీరు మన శరీరానికే కాదు.. చర్మం, జుట్టుకు కూడా చాలా ముఖ్యమైనదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు తగిన పరిమాణంలో నీటిని తాగడం వల్ల జుట్టు చిట్లిపోకుండా తయారవుతుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి నూనె:
జుట్టును శుభ్రం చేసే ముందు ప్రతి రోజు 2 నుంచి 3 గంట ముందు కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడవుగా, దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు చివరల చీలి పోకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి:
జుట్టు చివర్ల చీలిపోవడాన్ని నివారించడానికి తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు విటమిన్లు, ఖనిజాలు అతిగా పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జుట్టుకు ఎక్కువగా షాంపూని వినియోగించకూడదు:
జుట్టుకు ఎక్కువగా షాంపూని వినియోగించడం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో జుట్టును దెబ్బతిసే అనేక రకాల రసాయనాలు ఉంటాయి. కాబట్టి దీనిని వినియోగించడం అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి జుట్టును శుభ్రం చేసుకోవాలనుకునేవారు వారానికి 2 నుంచి 3 సార్లు జుట్టును శుభ్ర చేసుకోవడం చాలా మంచిది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి