Kakarakaya Juice Recipe: కాకరకాయ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. దీని డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయలో ఉండే విటమిన్ ఎ కళ్లకు మేలు చేస్తుంది. అంతేకాకుండా కాకరకాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని పెద్దలు , పిల్లలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది . అంతేకాకుండా కాకరకాయ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా అయితే ఈ దివ్యౌషధం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి రోగులు అయన ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల పేగులు శుభ్రపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్, ఇది కాలేయాన్ని బలపరుస్తుంది. ఇది కాలేయం దెబ్బతినకుండా రక్షణను కూడా అందిస్తుంది.
కాకరకాయ జ్యూస్ రెసిపీ:
కావాల్సిన పదార్థాలు:
ఒక కాకరకాయ
ఒక నిమ్మకాయ
ఒక టీస్పూన్ అల్లం ముక్కలు
ఒక టీస్పూన్ తేనె
నీరు
తయారీ విధానం:
కాకరకాయను తొక్క తీసి, ముక్కలుగా కోయాలి. నిమ్మకాయను ముక్కలుగా కోయాలి.అన్ని పదార్థాలను మిక్సీలో వేసి, మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వడకట్టి, తాగాలి.
చిట్కాలు:
కాకరకాయ రుచి చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి, మీరు తేనెను కలిపి తాగవచ్చు.
కాకరకాయ జ్యూస్‌ను ఉదయం పరగడుపున తాగడం మంచిది.
ఈ విధంగా మీరు కారకాయ జ్యూస్‌ను తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అలాగే మహిళలు, పెద్దలు దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter