SRH vs MI Dream11 Prediction: ఐపీఎల్ 2023 సీజనల్లో మంగళవారం కీలక పోరు జరగనుంది. ఈ రోజు సాయంత్రం 3:30 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే బిగ్‌ఫైట్‌లో ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా సేమ్ టూ సేమ్. మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై, హైదరాబాద్ మధ్య 19 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌లు గెలవగా.. ముంబై 9 మ్యాచ్‌లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీయగా.. సూపర్ ఓవర్ కూడా టై అయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లూ సమంగా నిలిచాయి. అయితే ఈ రోజు జరగబోయే పోరులో రెండు టీమ్‌లు ఈ సీజన్లో ముఖాముఖి మొదటిసారి తలపడబోతున్నాయి. ఏ టీమ్ విక్టరీని సాధిస్తుందో చూడాలి. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం ఉంది.
డ్రీమ్ 11లో ప్లేయర్లను ఇలా ఎంచుకోండి:
డ్రీమ్ 11లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను, మెరుగైన ప్రదర్శ ఆధారంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీరు రెండు జట్లకు సంబంధించిన ప్లేయింగ్ 11ను తప్పకుండా చూడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ టీమ్‌కు సంబంధించిన వివరాలు ఇవే..
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, రిలే మెరెడిత్, జాసన్ బెహ్రిండోర్ఫ్
Also Read: RCB vs CSK Dream11 Prediction: బెంగళూరు జోరుకు చెన్నై బ్రేక్ వేసేనా?, డ్రీమ్ 11 టిప్స్ ఇవే!
బెస్ట్ టీమ్ (Dream11 Best Team):
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హేన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
డ్రీమ్ 11 ప్రిడిక్షన్ (Dream11 Prediction Today Match):
కీపర్: ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్
ఆల్ రౌండర్లు: కామెరాన్ గ్రీన్, వాషింగ్టన్ సుందర్
బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, పీయూష్ చావ్లా, ఉమ్రాన్ మాలిక్.
Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.