AP Politicians Twitter Followers: ప్రస్తుతం రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరు ఎంత ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తే.. గెలుపు వారిదే అనే అభిప్రాయం కూడా ఏర్పడిపడిపోయింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులను ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. చంద్రబాబును ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 5 మిలియన్లు దాటింది. టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. మా బాస్‌కు ఐదు మిలియాన్ల ఫాలోవర్లు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన బర్త్ డేకు ముందు చంద్రబాబు నాయుడు ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఫాలోవర్ల విషయానికి వస్తే.. ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఎక్కువమంది ఉన్నారు. ఆయనను ట్విట్టర్‌లో అనుసరించే వారి సంఖ్య 5.3 మిలియన్లు ఉంది. రెండోస్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రికి ట్విట్టర్‌లో 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. టీడీపీ నేత నారా లోకేష్‌కు ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్‌కు దగ్గరలో ఉంది.
ఫేస్‌బుక్ విషయానికి వస్తే.. ఇతర నాయకులకంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఆయనకు 2.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. 2 మిలియన్ల మంది ఫాలోవర్లతో నారా లోకేష్ రెండోస్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడును 1.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌తో పోలిస్తే.. ఫేస్‌బుక్‌లో పవన్ కళ్యాణ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆయన ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్‌కు దగ్గరగా ఉంది.
Also Read: WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఎవరంటే..?
ఇక పార్టీల పరంగా చూస్తే.. ట్విట్టర్‌లో జనసేనకు టాప్ ప్లేస్‌లో ఉంది. జనసేనకు రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. వైసీపీకి ఒక మిలియన్‌గా దగ్గర ఉంది. తెలుగుదేశం పార్టీకి 50 లక్షల మందికిపైగా ఉన్నారు. అయితే ఫేస్‌బుక్‌లో టీడీపీని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఆ పార్టీకి 4.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జనసేన పార్టీకి 1.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. అధికార వైఎస్సార్సీపీకి 1.2 మిలియన్ మంది ఉన్నారు.
Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్‌లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook