Premature White Hair Problem: ప్రస్తుతం చాలా మందిలో చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వారాల తరబడి వినియోగించిన ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల సహజంగా మీరు తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించి సులభంగా తెల్ల జుట్టును తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి తప్పకుండా ఈ చిట్కాలు పాటించాలి:
తెల్ల శనగలు:
తెల్ల శనగలతో తయారు చేసిన ఆహారాలు ప్రతి రోజు తింటూ ఉంటారు. మరికొందరైతే వీటితో వడియాలు కూడా చేసుకుంటారు. తెల్ల శనగల్లో విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా 400 మైక్రోగ్రాములు కూడా లభిస్తాయి. కాబట్టి వీటినితో తయారు చేసిన ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
చికెన్:
చికెన్‌లో విటమిన్ బి12 అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పప్పులు ధాన్యాలు:
శరీర అభివృద్ధికి పప్పు ధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్ B12తో పాటు DNA, RNA ఉత్పత్తిని చేసే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా పప్పులు ధాన్యాల్లో అమైనో యాసిడ్ కూడా లభిస్తాయి. కాబట్టి శరీరంలో మెథియోనిన్ ఉత్పత్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రోటీన్స్ గల ఆహారాలు:
శరీరానికి ప్రోటీన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ప్రోటీన్స్ గల ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు రాకుండా జుట్టుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి