Vat Savitri Vrat 2023: వటసావిత్రీ వ్రతానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలు ఈ రోజు మర్రి చెట్టును పూజించి ప్రదక్షిణ చేయడం వల్ల వివాహిత జీవితంలో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున వటసావిత్రీ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఫటించేవారు తప్పకుండా ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలగడమేకాకుండా చాలా రకాల లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉపవసాలు పాటించడం వల్ల ఏయే రాశివారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఈ వ్రతాన్ని ఏ సమయంలో పాటించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వటసావిత్రీ వ్రతం ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?:
వటసావిత్రీ వ్రతాన్ని 19 మే, శుక్రవారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. వివాహిత స్త్రీలు మర్రి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయిని పేర్కొన్నారు. అంతేకాకుండా చెట్టు చూట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.
వటసావిత్రీ వ్రతం శుభ సమయం:
అమావాస్య తిథి ప్రారంభ సమయం: మే 18 రాత్రి 09:42 గంటలకు ప్రారంభమై.. మే 19 రాత్రి 09:22 గంటలకు ముగుస్తుంది.
వటసావిత్రీ రోజు పాటించాల్సిన నియమాలు:
1. మీరు మొదటి సారి వటసావిత్రీ ఆచరించేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూజా స్థలం అంటే మీ దగ్గరిలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి శుభ్రం చేయాల్సి ఉంటుంది. తర్వాత గంగాజలాన్ని చల్లి ఈ ప్రదేశాన్ని శుద్ధి చేయండి.
2. మర్రి చెట్టును పూజించే క్రమంలో దీపాలను వెలిగించి..మర్రి చెట్టు వేర్లకు నీటిని సమర్పించి దాని చుట్టూ ఒక ముడి దారాన్ని ఏడు సార్లు చుట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది.
3. మర్రి చెట్టు ఆకుల దండను తయారు చేసి వ్రతాన్ని పాటించే స్త్రీలు ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వటసావిత్రీ కథను విని అత్తగారికి ఆశీర్వాదాలు తీసుకోవాల్సి ఉంటుంది.
4. ఆ తర్వాత ఒక బుట్టలో పండ్లు, ధాన్యాలు, వస్త్రాలు మొదలైనవాటిని ఉంచి..పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి