Virat Kohli IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు.. ఏ జట్లపై శతకాలు చేశాడంటే..?

Virat Kohli IPL Centuries List: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. వరుసగా బ్యాక్‌ టు బ్యాక్ సెంచరీలతో ఐపీఎల్‌లో హిస్టరీలో అత్యధిక సెంచరీలు (7) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సెంచరీలపై ఓ లుక్కేయండి.
 

1 /7

2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ అందుకున్నాడు. రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌పై శతకం (100) బాదాడు.   

2 /7

అదే సీజన్‌లో పూణె సూపర్‌జెయింట్స్‌పై బెంగుళూరు వేదికగా రెండో సెంచరీ (108) నమోదు చేశాడు.   

3 /7

ఈ సీజన్‌లోనే గుజరాత్ లయన్స్‌పై మరో శతకం బాదాడు కింగ్ కోహ్లీ. 55 బంతుల్లో 109 పరుగులు చేశాడు.  

4 /7

2016 సీజన్‌లో నాలుగో సెంచరీని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై పూర్తి చేసుకున్నాడు. 50 బంతుల్లో 113 పరుగులు చేశాడు.   

5 /7

2019 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో 58 బంతుల్లో 100 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఐదో శతకం పూర్తి చేసుకున్నాడు.   

6 /7

ఈ సీజన్‌లో రెండు సెంచరీలతో చెలరేగాడు విరాట్ కోహ్లీ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన ఆరో సెంచరీ (100)ని నమోదు చేశాడు  

7 /7

గుజరాత్ టైటాన్స్‌పై  101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నా.. దురదృష్టవశాత్తూ ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేదు.