Telangana Ration Dealers Called Off Strike: రేషన్ డీలర్లతో రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి శాఖ గంగుల కమలాకర్ చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు రేషన్ డీలర్లు ప్రకటించారు. తక్షణమే సమ్మె విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలతో పాటు రేషన్ డీలర్ల సంక్షేమం చూస్తామన్న మంత్రి హామీ ఇచ్చారు. కమీషన్ పెంపు ప్రతిపాధన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. 2 కోట్ల 83 లక్షల రేషన్ కార్డుదారుల ప్రయోజనం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యం అని అన్నారు. పేదలు ఆకలితో ఉండకుండా ప్రభుత్వంతో సహకరించాలని కోరారు.
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాటపట్టిన రేషన్ డీలర్ల సంఘం నాయకులతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ మేరకు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సీఎంకేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని కోరారు.
ఇప్పటికే గత సమావేశంలో మేజర్ సమస్యలపై స్పష్టత నిచ్చామని.. వాటి పరిష్కారంలో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తుందన్నారు మంత్రి. కమీషన్ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టి తీసుకువెళ్లి వివరిస్తామని చెప్పారు. మంత్రి గంగుల ఇచ్చిన స్పష్టమైన హామీపై రేషన్ డీలర్ల జేఏసీ సంతోషం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని తక్షణమే ప్రారంభిస్తున్నామని రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు.
Also Read: CM YS Jagan Mohan Reddy: పోలవరం పనులను పరిశీలించిన సీఎం జగన్.. డయాఫ్రం వాల్‌ను పూర్తిచేయాలని ఆదేశం
తమ సమస్యల పరిష్కారం కోసం శనివారం నుంచి సమ్మె బాటపట్టింది తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం. రేషన్ షాపులు బంద్ చేసి నిరనస తెలుపుతున్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ సరిగాలేదని వాపోయారు. చాలిచాలనీ కమీషన్‌తో దుకాణాలు నడపలేక.. అప్పుల పాలవుతున్నారని రేషన్ల డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం అందజేసి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో రేషన్ డీలర్ల సంఘం నాయకులతో మంత్రి గంగుల మాట్లాడి.. సమ్మె విరమించేలా ఒప్పించారు.
Also Read: Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి