Benefits Of Sleeping: ప్రస్తుతం చాలా మంది శరీరానికి విశ్రాంతిని అందించేందుకు మధ్యాహ్నం నిద్రపోతున్నారు. వాస్తవానికి ఇలా నిద్రపోవడం శరీరానికి లాభాలు ఉన్నాయి..వీటితో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. శరీరానికి తగినంత నిద్ర ఉంటేనే ఒత్తిడి ఇతర సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. చాలా మంది ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీకు ఒత్తిడిగా అనిపించినప్పుడుల్లా నిద్రపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధ్యాహ్నం ప్రతి రోజు 1 గంట పాటు నిద్ర పోవడం వల్ల అలసట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అధిక బిపి సమస్యలతో బాధపడేవారికి మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. హార్మోన్ల సమతుల్యత, జీర్ణశక్తి మెరుగుపడడానికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలా మందిలో పొట్ట సంబంధిత సమస్యలు వస్తున్నాయని..దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట పాటు నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పొట్ట సమస్యలైన అజీర్తి సమస్య నుంచి వేగంగా విముక్తి లభిస్తుంది.
ఆఫీసుల్లో ఒత్తిడి కారణంగా చాలా మందిలో అలసట, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల ఊబకాయం సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా మధ్యాహ్నం నిద్రపోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హార్ట్ బీట్ సమస్యలున్నవారు గుండె జబ్బులు రాకుండా ఉండడానికి నిద్ర తప్పనిసరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు మధ్యాహ్నం ఒక గంట పాటు నిద్రపోతే..శరీర పని తీరు కూడా మారుతుంది. అంతేకాకుండా కళ్లకు కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కళ్ల ఒత్తిడి, డ్రై ఐ వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నిద్రపోవాల్సి ఉంటుంది. రోజులో కాసేపు నిద్రపోవడం వల్ల మీ మూడ్ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి