Rahu Gochar 2023: చిత్రా నక్షత్రంలోకి కేతువు తిరోగమనం, ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం..కోలుకోని దెబ్బ

Rahu Gochar 2023: చిత్రా నక్షత్రంలో కేతువు తిరోగమనం కారణంగా చాలా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది రాశులవారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందలు పాలవుతారు. కాబట్టి డబ్బులు ఖర్చు చేసే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 20, 2023, 11:02 AM IST
Rahu Gochar 2023: చిత్రా నక్షత్రంలోకి కేతువు తిరోగమనం, ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం..కోలుకోని దెబ్బ

 

Rahu Gochar 2023: గ్రహాలు రాశుల సంచారాలే కాకుండా నక్షత్రంలోకి కూడా అప్పుడప్పుడు సంచారం చేస్తూ ఉంటాయి. కేతువు జూన్ 26న చిత్ర నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా కేతువు ప్రభావంతో 5 రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కేతువు గ్రహం తిరోగమనం చేసే 14వ నక్షత్రమైన చిత్రా నక్షత్రం చంద్ర వృత్తాన్ని ఖగోళ వాస్తుశిల్పి విశ్వకర్మ పాలిస్తాడు. అయితే దీని కారణంగా వ్యక్తుల జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ తిరోగమనం కారణంగా  సృజనాత్మకత, కళాత్మకత, అందం, పరివర్తనపై కూడా ప్రత్యేక ప్రభావం పడే ఛాస్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. 

కేతువు సంచారం వల్ల ఏ రాశులు ప్రభావితమయ్యే రాశులు ఇవే:
జూన్ 26న చిత్రా నక్షత్రంలో కేతువు సంచారంతో ఈ కింది రాశులవారి జీవితాలపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కేతువు సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మిథునరాశి:
కేతువు సంచారం కారణంగా మిథునరాశి ప్రేమ జీవితంపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశివారి శృంగార జీవితంపై ప్రత్యేక ప్రభావం పడి తీవ్ర సమస్యలు వస్తాయి. అంతేకాకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారు. దీంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. పిల్లల ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులపై కూడా ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

కర్కాటక రాశి:
చిత్రా నక్షత్రంలో కేతువు  తిరోగమనం కారణంగా కర్కాటక రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. ఇంట్లో వాతావరణం ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు కోపం తగ్గించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 

కన్యారాశి :
చిత్రా నక్షత్రంలో కేతువు సంచరించడం వల్ల కన్యారాశి వారి మాటతీరులో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీని కారణంగా ప్రజలలో అపార్థాలు తలెత్తుతాయి. ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మరింత లాస్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా డబ్బులు ఖర్చు చేసే క్రమంలో చూసి చేయాల్సి ఉంటుంది. 

Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News