Varun Tej: కొత్త సినిమా ప్రకటించిన మెగా ప్రిన్స్.. మట్కాగా వరుణ్‌ తేజ్‌..

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. అంతేకాకుండా దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పలాస దర్శకుడు కరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2023, 04:21 PM IST
Varun Tej: కొత్త సినిమా ప్రకటించిన మెగా ప్రిన్స్.. మట్కాగా వరుణ్‌ తేజ్‌..

Varun Tej Upcoming Movies: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న 'గాంఢీవధారి అర్జున' రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో రెండు సినిమలు అల్రెడీ సెట్స్ మీద ఉన్నాయి. తాజాగా వరుణ్ మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు. ఇతడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ సినిమాను చేయబోతున్నాడు. దీనిక సంబంధించిన లాంచ్ ఈవెంట్ గురువారం గ్రాంఢ్ గా జరిగింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయడమే కాకుండా టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి 'మట్కా' (Matka) అనే టైటిల్ ఖరారు చేశారు. నోట్ల కట్టల మధ్య రాయల్‌ కారును చూపిస్తూ చేసిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 

నానితో 'హాయ్ నాన్న' చేస్తున్న వైరా సంస్థే ఈ మూవీని కూడా తెరకెక్కిస్తోంది. 1960ల నాటి కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలో కరుణ్ కుమార్ పలాస అనే సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తీయబోతున్న ఈ చిత్రానికి జీవి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించనున్నాడు. 

Also Read: Tillu Square: సిద్దు 'టిల్లు స్క్వేర్' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ప్రస్తుతం వరుణ్ నటిస్తున్న చిత్రం 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరోవైపు వరుణ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి లావణ్యతో ఇతడి నిశితార్థం రీసెంట్ గా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. 

Also read: Bigg Boss season 7: ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ.. నాగార్జునతోపాటు బిగ్ బాస్ టీమ్ కు హైకోర్టు నోటీసులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News