Health Tips in Telugu: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల జీవణ విధానంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే మెదడు కూడా ముందుగానే వృద్ధాప్యం చెందుతోంది. శరీరంపై పూర్తి నియంత్రణ మన మెదడుకే ఉంటుంది. శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. కాబట్టి మెదడును ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకే మెదడు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం ఉన్న కొన్ని అలవాట్ల కారణంగా మెదడు త్వరగా ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఈ నేపథ్యంలో మీలో కూడా ఈ చెడు అలవాట్లు ఉంటే.. వెంటనే మరచిపోండి. మెదడుపై చెడు ప్రభావం చూపే అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకోండి..
ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌ను ఎక్కువ సేపు చూస్తు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరం. ఈ అలవాటు కారణంగా నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. అంతే కాదు స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం వల్ల కంటిచూపు, తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుత యువతలో చాలా మందికి ఈ అలవాటు ఉంది. స్క్రీన్‌పై ఎక్కువ సేపు పనిచేయాల్సి వస్తే.. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవడం ఉత్తమం.
ప్రస్తుతం ఎక్కువ శాతం ఉద్యోగాలు ఒత్తిడితో కూడుకున్నవిగా ఉన్నాయి. ఎక్కువ ఒత్తిడి మెదడుపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. ఆందోళన, నిరాశ, జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీస్తుంది. మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి ధ్యానం లేదా లోతైన శ్వాస వంటివి పాటించండి. యువత దీని గురించి మరింత అవగాహన కలిగి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
నిద్రలేమి కూడా ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ శాతం యువత రాత్రి అన్నీ తెలిసినా నిద్ర గురించి పట్టించుకోలేవట్లేదు. మెదడు సక్రమంగా పనిచేయడానికి నిద్ర చాలా ముఖ్యం. జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత, మానసిక స్థితి మార్పులకు కారణమవుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువ చక్కెర, ఎక్కువ కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మెదడుపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇలాంటి ఆహారం మెదడులో వాపునకు కూడా కారణమవుతుంది. ఇది న్యూరాన్లకు కూడా హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తింటే ఉత్తమం.
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుండాలంటే.. అందరూ తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం వేళల్లో 25 నుంచి 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
Also Read: Ghaziabad Man Death: షాకింగ్ ఘటన.. ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook