Guru chandal yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..గురు చండాల యోగాను అశుభకరమైన యోగంగా పరిగణిస్తారు. ఈ యోగం ప్రభావం అన్ని కొన్ని సమయాల్లో అన్ని రాశులవారిపై పడుతుంది. కొన్ని గ్రహాలు మేష రాశిలోకి సంచారం చేయడం వల్ల గురు చండాల యోగం అంతం కాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారు అనుకూల ఫలితాలు పొందడమే కాకుండా ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. బృహస్పతి, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం బృహస్పతి, రాహువు మేషరాశిలో సంచార దశలో ఉన్నాడు. అక్టోబర్ 30న రాహువు వేరే రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి సులభంగా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి చండాల యోగం నుంచి ఉపశమనం:
కర్కాటక రాశి:
గురు చండాల యోగం ముగుస్తుంది..కాబట్టి కర్కాటక రాశివారికి అదృష్టం రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా కర్కాటక రాశివారు వృత్తిపరమైన జీవితంలో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు వీరు ఆర్థిక శ్రేయస్సును కూడా పొందుతారు. వ్యాపారం లేదా వృత్తి జీవితంలో కొనసాగుతున్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
సింహం రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాహు చండాల యోగం ముగింపుకు చేరుకోవడంతో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఈ రాశివారికి ఎలాంటి డోకా ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
తుల రాశి:
గురు చండాల యోగం ముగిసిన వెంటనే తుల రాశి వారికి జీవితంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వివాహ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి