Chandrababu Placard: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో చంద్రబాబు ప్లకార్డుల ప్రదర్శన, పరువు పోయిందంటూ ఆందోళన

Chandrababu Placard: గోరుచుట్టుపై రోకలిపోటు అంటే ఇదేనేమో. అసలే బెయిల్ రాక రిమాండ్‌లో ఉంటూ ఇబ్బంది పడుతుంటే అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. పాపం టీడీపీ పరిస్థితి ఇదే. అసలేం జరిగిందంటే  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2023, 11:50 AM IST
Chandrababu Placard: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో చంద్రబాబు ప్లకార్డుల ప్రదర్శన, పరువు పోయిందంటూ ఆందోళన

Chandrababu Placard: హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేదికగా నిన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో చంద్రబాబు పరువు పూర్తిగా పోయిందట. క్రికెట్ మ్యాచ్‌కు చంద్రబాబుకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. అవును నిజమే..చంద్రబాబు అవినీతి ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. పూర్తి వివరాలు ఇలా ..

ఐసీసీ ప్రపంచకప్ 2023లో నిన్న జరిగిన్ పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్డేడియంలో జరిగిన మ్యాచ్ ఫలితం సంగతేమో గానీ తెలుగుదేశం వర్గాలకు, చంద్రబాబుకు మాత్రం షాక్ కల్గించే పరిణామంగా మారింది. మ్యాచ్‌కు ఆయనకు సంబంధమేంటని అనుకుంటున్నారా..ఉంది సంబంధం. అసలే స్కిల్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ ప్రయత్నాలు విఫలమై సమస్యల్లో ఉన్న చంద్రబాబు పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసేసే ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరుగుతుండగా స్టాండ్స్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఘటనే చంద్రబాబుకు గోరుచుట్టుపై రోకలిపోటుగా తయారైంది. 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన చంద్రబాబుకు సంబంధించిన ప్లకార్డు ఇది. ఎవరో కొందరు వ్యక్తులు మ్యాచ్ మధ్యలో స్కామ్‌స్టర్ చంద్రబాబు అని పేర్కొంటూ ఓ ప్లకార్డ్ ప్రదర్శించారు. ఇది కాస్తా కెమేరా దృష్టిని ఆకర్షించింది. దాంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పుడు.

స్కామ్‌స్టర్ బాబు..ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో 371 కోట్లు దొంగిలించాడు, అవినీతి టీడీపీ అని రాసి పక్కన చంద్రబాబు ఫోటో ముద్రించారు. ఈ ప్లకార్డును అందరికీ కన్పించేలా ప్రదర్శించడంతో కెమేరా దృష్టిని ఆకర్షించింది. దాంతో అంతర్జాతీయంగా చంద్రబాబు పరువు పోయిందంటూ టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

తెలుగుదేశం హయాంలో 2014-19లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట వందల కోట్ల రూపాయలు గోల్‌మాల్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఈ ఆరోపణలపైనే సీఐడీ ఆయన్ని అరెస్ట్ చేయడంతో ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

Also read: Chandrabau Case: చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంలో విచారణ శుక్రవారానికి వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News