Samsung Galaxy A23 Price: అతి తక్కువ ధరకే మంచి సాంసంగ్ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి సాంసంగ్ అధికారిక వెబ్సైట్ కొన్ని మొబైల్స్ పై బంపర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ ఫోన్స్‌పై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సాంసంగ్ అధికారిక వెబ్సైట్లో ఏయే స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాంసంగ్ అధికారిక వెబ్సైట్‌లో ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఏ సిరీస్‌కు సంబంధించిన మొబైల్ పై బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సాంసంగ్ గాలక్సీ A23 (Samsung Galaxy A23 5G) మొబైల్ ని కొనుగోలు చేసే వారికి కంపెనీ ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ లోని అందుబాటులో ఉంది. అయితే అధికారిక వెబ్సైట్లో ఈ మొబైల్ ఫోన్ MRP ధర రూ.30,990 లుగా ఉండగా సాంసంగ్ వీక్ ఆఫర్స్ లో భాగంగా రూ.6,000 వరకు ఇన్స్టెంట్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రూ.1,00 వరకు ఫ్లాట్ తగ్గింపు కూడా పొందవచ్చు. దీంతో ఈ మొబైల్ ఫోన్ రూ.23,999కే పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్ తో కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
బ్యాంక్ ఆఫర్స్:
సాంసంగ్ అధికారిక వెబ్సైట్ లో సాంసంగ్ వీక్ సేల్‌లో భాగంగా సాంసంగ్ గాలక్సీ A23 (Samsung Galaxy A23 5G) మొబైల్ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇక పేటీఎం, మోబిక్విక్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే క్రమంలో బిల్ చెల్లిస్తే రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
ఫీచర్స్, స్పెసిఫికేషన్‌లు:
1080x2408 పిక్సెల్ రిజల్యూషన్
6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
ఇన్ఫినిటీ-V డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్
గొరిల్లా గ్లాస్ 5 ప్రోటక్షన్
50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
Android 12 ఆధారిత OneUI 4.1.1 ఆపరేటింగ్ సిస్టమ్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook