India Tour Of South Africa 2023: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్.. రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కేఎల్ రాహుల్ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా నేరుగా టెస్ట్ సిరీస్‌కు జట్టుతో చేరనున్నారు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లకు జట్లను ప్రకటించగా.. తాజాగా బీసీసీఐ మార్పులు చేసింది. వన్డే జట్టుకు ఎంపికైన ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్.. తాను జట్టుకు అందుబాటులో ఉండడని చెప్పాడు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకుని.. వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో దీపక్ చాహర్ స్థానంలో ఆకాష్ దీప్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. స్టార్ పేసర్ మహ్మద షమీ కూడా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
వన్డే జట్టు ఇలా..
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్
==> ఫిట్నెస్ సమస్యల కారణంగా టెస్ట్ సిరీస్‌లో పాల్గొనేందుకు షమీకి బీసీసీఐ మెడికల్ టీమ్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు షమీ దూరమయ్యాడు.
==> డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లో మొదటి వన్డే ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ జట్టుతో చేరతాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రెండో, మూడో వన్డేలకు అందుబాటులో ఉండడు, ఇంటర్-స్క్వాడ్ గేమ్‌లో పాల్గొంటాడు.
==> టీమ్ ఇండియా హెడ్ కోచ్ మిస్టర్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ టెస్ట్ జట్టుతో చేరతాడు. ఇంటర్-స్క్వాడ్ గేమ్, టెస్ట్ సిరీస్‌కు ఆటగాళ్ల సన్నాహాలను పర్యవేక్షిస్తారు.
==> వన్డే జట్టుకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్, బౌలింగ్ కోచ్ రాజీబ్ దత్తా, ఫీల్డింగ్ కోచ్ అజయ్ తో కూడిన ఇండియా ఎ కోచింగ్ స్టాఫ్ సహాయం చేస్తారు.
Also Read: ఈ సంవత్సరం అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే.. మరీ ఇంత దారుణంగా..!
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం.. ఆ ఇబ్బందులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి