Oscar Challagariga: కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన చంద్రబోస్ 'ఆస్కార్ చల్లగరిగ'

RRR Chandrabose: ఆస్కార్ విన్నర్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పై తీసిన డాక్యుమెంటరీ రెండు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌ల‌కు ఎంపికైంది. ఈ డాక్యుమెంటరీకి సీనియర్ జ‌ర్న‌లిస్ట్ చిల్కూరి సుశీల్ రావు దర్శకత్వం వహించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 08:45 PM IST
Oscar Challagariga: కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన చంద్రబోస్ 'ఆస్కార్ చల్లగరిగ'

Oscar Challagariga: ఆస్కార్ విజేత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్(Chandrabose) పై తీసిన తెలుగు డాక్యుమెంటరీ 'ఆస్కార్ చల్లగరిగ'(Oscar Challagariga) సంచలనం సృష్టించింది. తాజాగా ఈ డాక్యూమెంటరీ కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes World Fim Festival)లో ఫైనల్స్ కు వెళ్లింది. అంతేకాకుండా ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌(Mumabi Short International Film Festival)కు ఎంపికైంది. ఈ డాక్యూమెంటరీకి ప్ర‌ముఖ సీనియర్ జ‌ర్న‌లిస్ట్ చిల్కూరి సుశీల్ రావు (Sushil Rao Chilkuri) నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్'(RRR) సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు లిరిక్స్ అందించిన చంద్రబోస్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. 

ఆస్కార్ అందుకొని తిరిగొచ్చిన చంద్రబోస్ కు తెలుగు ప్రజలు నీరాజనం పట్టారు. అయితే చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తర్వాత తన స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగకు వచ్చినప్పుడు వందలాది గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా తీసుకెళుతూ చంద్రబోస్ పై పూల వర్షం కురిపించారు. చంద్రబోస్ విజయాన్ని చల్లగరిగ గ్రామస్తులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారే కథాంశాన్ని తీసుకుని చిల్కూరి సుశీల్‌రావు ఒక డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించాడు. ఇప్పుడిదే రెండు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌ల‌కు ఎంపికైంది. దీనిపై సుశీల్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ డాక్యుమెంటరీ కేవలం చంద్రబోస్‌దే కాదు.. అతడిపై ప్రేమను కురిపించిన గ్రామస్తులది కూడా.. అని సుశీల్‌రావు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

Also Read: Bigg Boss 7 Final: అమర్ కు రవితేజ అంటే ఇంత పిచ్చా.. ఏకంగా టైటిల్ ను వదిలేసి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News