Mahesh Babu: ఒకప్పుడు మహేష్ కి కొడుకుగా…ఇప్పుడు ఆయనకే పోటీగా

Guntur Kaaram vs Hanuman:ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం. కాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా ఈ సినిమాకి పోటీగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ చిత్రాలలో ఇప్పుడు ఒక చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 08:47 AM IST
Mahesh Babu: ఒకప్పుడు మహేష్ కి కొడుకుగా…ఇప్పుడు ఆయనకే పోటీగా

Teja Sajja: సంక్రాంతి అనగానే మన ఊర్లో ఎంత గుర్తొస్తాయో మనకు సినిమాలు కూడా అంతే గుర్తొస్తాయి. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తప్పకుండా కనీసం ఒక నాలుగు ఐదు సినిమాలు వచ్చే సీజన్. రాబోతున్న 2024 సంక్రాంతి కూడా అలానే సినిమాలతో కలకలలాడబోతోంది. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో ప్రేక్షకులకు భారీగా అంచనాలు ఉండే చిత్రం మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు మహేష్ లుక్ అందరినీ ఆకట్టుకొని ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది…

త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మహేష్ బాబు కి తోడు కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఉండడం సర్వసాధారణమే. అయితే ఈ సంక్రాంతి సీజన్ కి స్టార్ హీరో సినిమా పైనే కాకుండా ఒక చిన్న హీరో చిత్రం పై కూడా తెలుగువారికి ఎన్నో అంచనాలు ఉన్నాయి. అది మరేదో సినిమా కాదు తేజ సజ్జ హీరోగా చేస్తున్న హనుమాన్.

తేజా సజ్జ గురించి కూడా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే తేజా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన బాలనటుడు. ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలో తన నటనతో చిన్నప్పుడే మెప్పించాడు. ఇప్పుడు హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఓ బేబీ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించి అలరించిన తేజ ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మారి.. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ సినిమాలు చేశారు. అయితే, ఈ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే, ఇప్పుడు ‘హనుమాన్’ అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కాగా ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కావడంతో.. ఈ సినిమా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న భారీ చిత్రం ‘గుంటూరు కారం’తో పోటీపడబోతోంది. అనగా యువ హీరో తేజ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోటీపడనున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు.. తేజా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ పోస్టులు షేర్ అవుతున్నాయి.

అదేమిటి అంటే మహేష్ బాబు, తేజ మధ్య ఉన్న కనెక్షన్. మహేష్ బాబు హీరోగా వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో 2000 సంవత్సరంలో ‘యువరాజు’ సినిమా వచ్చింది. సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్ల గా నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. మహేష్ బాబు, తేజ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా అప్పట్లో మహేష్ బాబుకి కొడుకుగా నటించిన తేజ ఇప్పుడు ఏకంగా ఆయనతోనే పోటీ పడదం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ఇమేజ్ పరంగా చూసుకుంటే మహేష్ బాబుతో పోటీ పడేంత మార్కెట్, స్థాయి తేజా సజ్జకు లేవు. కానీ, సినిమాలో కంటెంట్ పరంగా పోటీ పడేంత సత్తా ఉందని హనుమాన్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏది ఏమైనా ఒకప్పుడు మహేష్ బాబుకి కొడుకుగా నటించి ఇప్పుడు ఆ సూపర్ స్టార్ తోనే పోటీ పడదం .. అంతేకాకుండా తేజ స్టార్ల ఫ్యామిలీ నుంచి కాకుండా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో కావడం…ఆయన్ని అందరూ మెచ్చుకునేలా చేస్తౌంది.

Also Read: Kalki 2898 AD :కల్కి లో ఇండియా ఫ్యూచర్ చూస్తారు.. ట్రైలర్ విడుదల అప్పుడే: నాగ్ అశ్విన్

Also Read:Thalapathy Vijay Attacked: విజయ్ కాంత్ అంత్యక్రియలు వద్ద దళపతి విజయ్‌పై చెప్పుతో దాడి.. స్టార్ హీరోకు ఘోర అవమానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News