Ayodhya Effect on UK: ప్రపంచమంతా అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. శతాబ్దాల కాలం ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం సాకారమవుతుండడంతో ప్రపంచంలోని హిందూ ప్రజలంతా పరమానందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల నుంచి హిందూవులు అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి తరలివస్తున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంగ్లాండ్ పార్లమెంట్లో శ్రీరామ నామస్మరణ జరిగింది. అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా యూకేలోని పార్లమెంట్ భవనంలో సంబరాలు జరిగాయి.
అక్కడి సనాతన్ సంస్థ ఆఫ్ యూకే (ఎస్‌ఎస్‌యూకే) ఆధ్వర్యంలో యూకే పార్లమెంట్లో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కీర్తనలు, భక్తి పాటలు ఆలపించారు. నిండు సభలో జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో పార్లమెంట్ భవనం మొత్తం హిందూ ధార్మికతతో నిండిపోయింది. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు. శంఖం ఊదుతూ ఎస్‌ఎస్‌యూకే ప్రతినిధులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా అక్కడి వారికి బొట్టు ధరించి కాషాయ జెండాలు కప్పారు. అనంతరం పార్లమెంట్ భవనంలోనే భారత శాస్త్రీయ నృత్యం కళాకారులు ప్రదర్శించారు.
ఎస్‌ఎస్‌యూకే నిర్వాహకులు యుగ్పురుష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సభలో కక్భూషుండి సంవాద్‌ను ప్రదర్శించారు. అనంతరం భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని చదివి వినిపించి కృష్ణుడి గొప్పతనం కీర్తించారు. అయోధ్యలో ఆలయ ప్రాణప్రతిష్టపై యూకేలోని 200 ఆలయాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఓ పత్రంపై సంతకాలు చేసి బ్రిటన్ పార్లమెంట్‌కు సమర్పించాయి. యూకేలోని ధార్మిక సంస్థలు ఇచ్చిన ప్రకటనను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు యూకే ప్రతినిధులు అందించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి దేశం నుంచి పలువురు ప్రతినిధులు అయోధ్యలో జరిగే వేడుకకు వస్తున్నారని సమాచారం.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Also Read: Boat Accident: గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter