Lemon Candy Ice Cream: లెమన్ ఐస్ క్రీమ్‌ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. మనకు బయట లభించే ఐస్ క్రీమ్ కంటే ఈ లెమన్ ఐస్ క్రీమ్ ఎంతో రుచి కరంగా ఉంటుంది. దీని కోసం ఇంట్లో లభించే ఆహార పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది. అయితే లెమన్ ఐస్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
లెమన్ ఐస్ క్రీమ్‌కి కావల్సిన పదార్థాలు:
నిమ్మకాయ, 250Ml నీళ్లు , పావు కప్పు పంచదార, ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, పుదీనా, అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఫుడ్ కలర్
లెమన్ ఐస్ క్రీమ్ తయారీ విధానం:
ముందుగా పావు టీ స్పూన్ నిమ్మకాయ తొక్కను తురిమి తీసుకోవాలి. ఒక గిన్నెలో పంచదార, నీళ్లు చ నిమ్మ తొక్కను వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత నీటిలో కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి. మూడు నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో పుదీనా ఆకులు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చల్లారిన తరువాత పంచదారలో వేసి కలుపుకోవాలి. నిమ్మరసం, పసుపు, బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నికుల్ఫీ మౌల్డ్స్ లోకి తీసుకోవాలి. దీనిపై అల్యూమినియం ఫాయిల్ ని ఉంచి స్టిక్ ను ఉంచాలి.
ఎనిమిది గంటల డీ ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత వీటిని బయటకు తీసి నెమ్మదిగా మౌల్డ్స్ నుండి వేరు చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ ఐస్ క్రీమ్ తయారవుతుంది.
Also Read Ragi Malt: రాగి మాల్ట్ షర్బత్ ఆరోగ్యానికి ఏంతో శ్రేయస్కరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter