Peepal Leaf Benefits: రావి చెట్టులో ప్రతీ భాగంలోనూ ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ రాగి ఆకులో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రావి ఆకులు, కాండం, బెరడు, విత్తనాలు, పండ్లను ఔషధాలుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా రావిచెట్టు వేర్ల చివర్ల చర్మంపై ఉండే ముడతలు, నల్ల మచ్చలు వంటి సమస్యలను దూరం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
ఆస్తమా సమస్యతో బాధపడుతున్నవారు రావి ఆకు, బెరడు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తప్పకుండా వాడటం వల్ల ఆస్తమా సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు రావి ఆకుల్ని పొడి చేసి తీసుకొని నీటిలో కలపుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల డయాబెటిస్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
రావి ఆకులు తీసుకోవడం వల్ల పాము కాటు వేసినప్పుడు ఉపయోగిస్తారు. ఈ ఆకులు పాము కాటు విషానికి విరుగడుగా పనిచేస్తుంది.
రావి ఆకుల్ని తింటే తామర వ్యాధికి చెక్ పెట్టవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారుచేసుకోవచ్చు.
రావి ఆకులు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి. ఆకులను బెల్లంతో కలిపి నాలుగు రోజు తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
రక్తం కారిపోతూ ఉన్నప్పుడు రావి ఆకు, స్పటిక, ధనియాలు, చక్కెర తీసుకొని గుజ్జులా చేసుకోవాలి. దీనిని మూడు రోజుల పాటు తీసుకోవడం వల్ల రక్తం గడ్డకడుతుంది.
వాతావరణ మార్పుల కారణంగా వచ్చే దగ్గు, వాంతుల వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
రావి బెరడు, రావి పండ్లు ఉబ్బసం సమస్య చికిత్సకు సాయపడుతుంది.
Also read: Skin care: ముఖంపై నల్లమచ్చలు తగ్గడానికి బెస్ట్ హోం రెమిడీ.. స్కిన్ గ్లో విపరీతంగా పెరుగుతుంది..
డయేరియా సమస్యతో బాధపడుతున్నవారు రావి చెట్టు కాండం తీసుకోవడం వల్ల ఎంతో సహాయపడుతుంది. రావి కాండం, ధనియాలు, పట్టిక బెల్లం తీసుకొని మిక్స్ చేసి తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ విధంగా రావి చెట్టు ఆకులు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకులు ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter