Autoimmune Disease: ఆటో ఇమ్యూన్ వ్యాధి అనేది మనిషి శరీరంలోని హెల్తీ టిష్యూలపై దాడి చేస్తుంటుంది. శరీరంలోని టిష్యూని ప్రత్యర్ధిగా భావించి దాడి చేయడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ల్యూపస్, మల్టిపుల్ స్కెలెరోసిస్ వ్యాధులు దీనికి ఉదాహరణ.
సాధారణంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే ఈ వ్యాధి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లోనే ఈ వ్యాధి ఎందుకు ఎక్కువగా ఉంటుందనే విషయంలో తాజాగా కొన్ని అధ్యయనాలు జరిగాయి. సెల్ జర్నల్‌లో ఈ అంశం ప్రచురితమైంది. మహిళల్లో ఉండే ఎక్స్ క్రోమోజోమ్‌పై పనిచేసే ప్రత్యేక అణువులు అప్పడప్పుడూ ఇమ్యూన్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తుంటాయని తేలింది. అయితే ఇదొక్కటే కారణం కాదు. భవష్యత్తులో ఉపయోగించే మందులు ఇమ్యూన్ సిస్టమ్‌ను బలహీనం చేస్తాయి.
మహిళలు, పురుషులు ఇద్దరిలో 22 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. 23వ జత వేరుగా ఉంటుంది. మహిళల్లో ఉండేవి రెండూ ఎక్స్ క్రోమోజోములే. కానీ పురుషుల్లో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. దీనివల్ల పురుషుల యోని అంగం అభివృద్ధి చెందుతుంది. ప్రతి క్రోమోజోమ్‌లో జీన్ ఉంటుంది. ఈ జీన్ యాక్టివ్ కావడం వల్ల సెల్స్ లోపల ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. రెండు ఎక్స్ క్రోమోజోములున్న మహిళలు, పురుష్కులతో పోలిస్తే రెట్టిపు ఎక్స్ ప్రోటీన్లు తయారు చేస్తాయిని బావిస్తాం కానీ అలా జరగదు. అందుకే రెండు ఎక్స్ క్రోమోజోముల్లో ఒకటి నిష్ప్రయోజనమే.
ఎక్సిస్ట్ అనే అణువు ఎక్స్ క్రోమోజోమ్‌తో వెల్ క్రోలా అంటుకుపోతుంది. వందలాది అణువులు ఎక్స్ క్రోమోజోమ్ చుట్టూ అతుక్కుని ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్ మహిళల శరీరంలో సెల్స్ సాధారణ రూపంలో మరణించినప్పుడు సంభవిస్తుంది. సెల్స్ చనిపోతే మహిళల్లో ఈ వ్యాధి తలెత్తవచ్చు.
Also read: AP Politics: వైసీపీలో మరో వికెట్ డౌన్, రాజకీయాలకు దూరం కానున్న ఆ ఎంపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook