ఓటమిని అంగీకరించిన హరీశ్‌రావు‌కు థ్యాంక్స్ - పీసీసీ చీఫ్ ఉత్తమ్

          

Last Updated : Oct 12, 2018, 12:03 PM IST
ఓటమిని అంగీకరించిన హరీశ్‌రావు‌కు థ్యాంక్స్ - పీసీసీ చీఫ్ ఉత్తమ్

హైదరాబాద్: హరీశ్ రావు  రాసిన లేఖపై టి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న హరీశ్ రావు రాసిన లేఖలో ఒక్కటి కూడా తెలంగాణ ప్రజలకు పనికొచ్చే విషయం లేదని ఎద్దేవ చేశారు. పైగా ఆయన లేఖ రాసిన తీరు చూస్తే టీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు తన లేఖలో తేల్చారని.. తమ విజయాన్ని అంగీకరినందుకు ఆయనకు ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. మంగళవారం టి.కాంగ్రెస్ కు టీఆర్ఎస్ నేత హరీశ్ రావు లేఖ ద్వారా 12 ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు స్పందించారు.

కేసీఆర్ కు ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తాం
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యే సమయం ఆసన్నమైందని ఎద్దేవ చేశారు.  రాష్ట్ర సంపదను కేసీఆర్ దోపిడిదొంగ తరహాలో  దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని మూఢనమ్మకాలతో  టీఆర్ఎస్ పాలించిందని..అయితే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ కు పలు ప్రశ్నలతో కూడిన లేఖ రాశారు. దీనికి సమాధానం చెప్పాలని కేసీఆర్ కు సవాల్  విసిరారు. దీనిపై టీఆర్ఎస్ ఏ మేరకు స్పందిస్తందనే దానిపై ఉత్కంఠత నెలకొంది.

Trending News