Thalapathy Vijay Last Movie: మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో ఈ మధ్య త్రివిక్రమ్ కొన్ని వివాదాలు చవిచూశారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటన అద్భుతంగా ఉన్నప్పటికీ త్రివిక్రమ్ దర్శకత్వం బాగా లేకపోవటం వల్లే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అంటూ చాలామంది ఈ దర్శకుడిని విమర్శించారు. అంతేకాదు మాటల మాంత్రికుని కలంలో పదును తగ్గింది అంటూ కూడా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఈసారి తన తదుపరి ప్రాజెక్టు గట్టిగా ప్లాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట త్రివిక్రమ్. ముందుగా త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉందచ్చని వార్తలు వినిపించాయి…కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తదుపరిచిత్రం అసలు తెలుగు హీరోతోనే కాదని తమిళ హీరోతో చేయబోతున్నారని వినికిడి.
అసలు విషయానికి వస్తే తమిళ హీరో విజయ్ ప్రస్తుతం తన 68వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని నాగ చైతన్యతో కస్టడీ మూవీ చేసిన వెంకట్ ప్రభు ఈ మ డైరెక్ట్ చేస్తున్నారు. దళపతి విజయ్ ఈ మూవీలో డ్యుయల్ రోల్లో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్ తన 69వ చిత్రం తెలుగు నిర్మాత డి డివివి దానయ్యతో చేయబోతున్నారు.
దళపతి 69 గా రానున్న ఈ సినిమా తన చివరి చిత్రం కానుందని.. ఎందుకంటే ఆ తరువాత తాను పూర్తిగా రాజకీయాల్లో భాగం కానున్నానని విజయ్ ఇదివరకే తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఎవరనే చర్చ గత కొద్దిరోజులుగా జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి విజయ్ ఏకంగా 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట.
దీన్నిబట్టే ఈ చిత్రం బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. అందుకు తగ్గట్టుగానే చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు డివివి దానయ్య దర్శకుడిగా త్రివిక్రమ్ ని తీసుకుందాం అనుకుంటున్నారట. ఇప్పటికే కొంతమంది తమిళ డైరెక్టర్లు చెప్పిన కథలు విజయ్ కి వినిపించగా అవేవీ మన హీరోని ఆకట్టుకోలేదట. ఈ నేపథ్యంలో దానయ్య త్రివిక్రమ్ ని కలిసినట్టు.. త్రివిక్రమ్ విజయ్ కోసం ఒక సూపర్ కథని తయారు చేస్తున్నట్టు వినికిడి. గుంటూరు కారం విమర్శల నుంచి బయట పడడానికి పెద్ద స్కెచ్ వేసి మరి తన తదుపరి చిత్రం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటున్నారట మన మాటల మాంత్రికుడు.
ఇదే కానీ నిజమైతే ఈ సినిమా తెలుగు భాషలోనూ అలానే తమిళ భాషలోనూ బ్లాక్ బస్టర్ రిలీజ్ సొంతం చేసుకోవడం ఖాయం. ఇక ఇందులోని నిజా నిజాలు తెలియాలి అంటే ఈ సినిమా యూనిట్ దర్శకుడి గురించి అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.
Also Read: Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం
Also Read: Sonia Assets: సోనియా గాంధీకి సొంత కారు లేదంట.. ఇక మిగతా ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook