Snakes Fear Plants: కొన్నిరకాల మొక్కలంటే పాములకు అస్సలు నచ్చదంట. ఈ చెటల నుంచి ఒక ప్రత్యేక మైన వాసన వస్తుంది. దీని చుట్టుపక్కల కూడా పాములు అస్పలు కన్పించవని చెబుతుంటారు. అందుకే కొందరు ఏరీ కొరీ మరీ ఈ చెట్లను తమ ఇంటిలో సెఫ్టీ కోసం వీటిని పెంచుకుంటారు.
పాములంటే ప్రతిఒక్కరు భయంతో వణికిపోతుంటారు. మనం ఎలాగైతే పాములను చూసి భయపడతామో... పాములు కూడా అలానే మనుషులను చూసి భయపడతాయి. ఆహరం కోసం అవి మానవ ఆవాసాలకు వస్తుంటాయి.
అడవులు, చెట్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పాములు కన్పిస్తుంటాయి. పొలాల నుంచి కూడా మన ఇండ్ల లోకి పాములు వస్తుండం మనం చూస్తుంటాం. పాములు కొన్ని చెట్లను అస్సలు ఇష్టపడవంట..
ఈచెట్లు ఉన్న ఇండ్ల దగ్గరకు పాములు అస్సలు రావంట. పొలాల్లో లేదా ఇండ్లలో చాలా మంది బంతి పూల చెట్లను పెట్టుకుంటారు. ఇవి పాములకు నచ్చవంట. అందుకే బంతిపూల చెట్లను చాలా మంది పెంచుకుంటారు
ఉల్లిపాయ, వెల్లుల్లి ముఖ్యంగా నెలలో పెరుగుతాయి. వీటి నుంచి ఘాటైన వాసన కూడా వస్తుంది. ఈ వాసనంటే పాములకు అస్సలు పడదంట. అందుకే వీటి చుట్టుపక్కల పాములుండవు.
లవంగం బాసిల్, పుష్పించే ఉల్లిపాయ, కొన్నిరకాల గడ్డి జాతుల మొక్కల దగ్గర పాములు అస్సలు ఉండవంట. అందుకే చాలా మంది వీటిని ఇంట్లో పెంచుతుంటారు. బాల్కనీలో కూడా వీటిని పెంచుతుంటారు
అదే విధంగా ఇంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా సువాసన వచ్చే మల్లె, పారిజాతం, గుబురుగా పెరిగే మొక్కలు, బిల్వపత్రి మొక్కలను అస్సలు పెంచకూడదు. మొగలి చెట్లు కింద కూడా పాములు ఉంటాయి. అందుకే వీటిని ఇంట్లో పెంచకూడదు.
ఇంట్లో ఎక్కువగా ఎలుకలు లేకుండా చూసుకొవాలి. ముఖ్యంగా ఎలుకల కోసం పాములు ఇంట్లోకి చొరబడుతుంటాయి. పాములు కన్పిస్తే చంపేబదులు, స్నేక్ సొసైటికి సమాచారం ఇవ్వాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)