Health Benefits: కొందరు ప్రతిరోజు ఉదయం పూట వాకింగ్ చేస్తుంటారు. కానీ సమ్మర్ లో వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. లేకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
వాకింగ్ చేయడం హెల్త్ కు ఎంతో మంచిది. సీజన్ ను బట్టి వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ముఖ్యంగా సమ్మర్ లో జిమ్ లకు వెళ్లేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కొన్నిజాగ్రత్తలు పాటించాలి.
ఉదయంపూట లేవగానే బ్రష్ చేసుకుని, నీళ్లు తాగి వాకింగ్ ను ప్రారంభిచాలి. కానీ కొందరు నీళ్లు తాగకుండానే వాకింగ్ కు వెళ్తారు. దీంతో శరీరం అంతా డీహైడ్రేషన్ కు గురౌతుంది. ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
కొందరు ఉదయం పూట వాకింగ్ కు బనానాలను తింటారు. బనానా ను ఖాళీ పోట్టతో అస్సలు తినకూడదు. బనానా తిన్నాక కొన్నిరకాల రసాయనాలు విడుదలౌతుంది. దీంతో శరీరంలో జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తుంటాయి.
ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ ను తప్పనిసరిగా పెట్టుకొవాలి. జాగింగ్ చేసేటప్పుడు శరీరానికి కాస్తంత విరామం ఇవ్వాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి గుండె నొప్పి సమస్యలు కూడా వస్తుంటాయి.
మొలకెత్తిన గింజలను కొందరు తింటారు. కానీ ఉదయం పూట కొద్దిగా తినాలి. మార్నింగ్ వాక్ తర్వాత.. మరల మంచి ఫుడ్ ను తీసుకొవాలి. డైటిషియన్ లను సంప్రదించి మంచి టిప్స్ లను ఫాలో అవ్వాలి.
వాకింగ్ చేసేటప్పుడు.. మంచి షూస్ లను సెలక్ట్ చేసుకుని వేసుకొవాలి. అదే విధంగా.. ఎంత దూరం నడిచామో టైమర్ ను పెట్టుకొవాలి. సమ్మర్ లో ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వాకింగ్ చేయాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు వాకింగ్ లాంటివి చూయకూడదు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)