Gaami Movie Pre Release Business: 'గామి' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. విశ్వక్‌సేన్ ముందున్న టార్గెట్ ఎంతంటే.. ?

Gaami Movie Pre Release Business: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్  హీరోగా.. చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'.  విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన  మూవీ 'గామీ'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచింది. మహా శివరాత్రి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. హిట్ కోసం ఎంత రాబట్టాలంటే..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 7, 2024, 02:13 PM IST
Gaami Movie Pre Release Business: 'గామి' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్.. విశ్వక్‌సేన్ ముందున్న టార్గెట్ ఎంతంటే.. ?

Gaami Movie Pre Release Business:: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ముందు నుంచి డిఫరెంట్ మూవీలతో తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇపుడు 'గామి' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో తొలిసారి అఘోర పాత్రలో నటించాడు. విద్యాధర్ కాగితా దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు.. ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా  విడుదల కానుంది. భారీ విజువల్ ట్రీట్‌తో వస్తోన్న 'గామి' సినిమా ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు 'A' సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా మొత్తం ఆధ్యాత్మికతతో పాటు సస్పెన్స్ 'గామి' సినిమాలో మెయిన్ పాయింట్. ఇది ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అని చెప్పాలి.  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయింది. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..

తెలంగాణ (నైజాం).. రూ. 3.50 కోట్లు..
రాయలసీమ (సీడెడ్).. రూ. 1.2 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ .. రూ. 3.50 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 8.20 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 2 కోట్లు..
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 10.20 కోట్లు..

విశ్వక్ సేన్ గత సినిమా 'దమ్కీ' మూవీ మంచి బిజినెస్ చేసింది. తాజాగా గామి సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తంగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే థియేట్రికల్‌గా రూ. 11 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్స్ నడుస్తున్నాయి. సినిమాలకు మహారాజ పోషకులైన స్టూడెంట్స్ పరీక్షల కారణంగా ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. ఈ సినిమాకు ఎక్స్‌లెంట్ టాక్ వస్తే కానీ.. సినిమా సేఫ్ కాదు.

ఇప్పటికే విడుదలైన 'గామి'ట్రైలర్‌లో విశ్వక్ సేన్ నటన ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సీన్స్ చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. అతను ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే మూడు పుష్కరాలు (36 ఏళ్ల)కి ఒకసారి హిమాలయాల్లో జరిగే అద్భుతానికి సంబంధించి ఒక ప్రదేశానికి చేరుకోవాలి అని చెబుతారు ఆయన గురువు. ఆ పనిపైనే హిమాలయాలకు బయల్దేరతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవరోధాలు ఎదుర్కొని నిలిచాడనేదే 'గామి' చిత్ర కథ.

ఈ ట్రైలర్లో హీరో పాత్రతో పాటు మరో రెండు పాత్రలు మాత్రమే ఉన్నాయి. ఒక  క్యారెక్టర్‌లో ఒక ఊరిలో దేవదాసిగా ఉన్న మహిళ, మరో పాత్ర పరిశోధనశాలలో బంధీగా ఉన్న ఓ కుర్రాడు. అసలు ఈ రెండు పాత్రలకు హీరో పాత్రకి ఉన్న సంబంధం ఏమిటి.. మధ్యలో హీరోయిన్ చాందిని చౌదరి పాత్ర వెనుక కథ ఏమిటి అని ఎన్నో సందేహాలతో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తోంది గామి ట్రైలర్. మరి ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Also read: Ind vs Eng 5th Test: ఇండియా ఇంగ్లండ్ చివరి టెస్ట్ నేడే, ధర్మశాల పిచ్ రిపోర్ట్, ఇరు జట్ల బలాబలాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x