Mysore Pak Recipe In Telugu: టేస్టీ మైసూర్ పాక్‌లను కేవలం ఇలా 15 నిమిషాల్లో ఇంట్లోనే తయారు చేసుకోండి..

Mysore Pak Recipe In Telugu: మైసూర్ పాక్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలామంది దీనిని తయారు చేసుకునే క్రమంలో విఫలమైతున్నారు. మేము అందించే ఈ సులభమైన పద్ధతిని వినియోగించి తయారు చేసుకుంటే, అచ్చం స్వీట్ షాప్ టైపులో లభించే మైసూర్ పాక్ పొందడం ఖాయం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 8, 2024, 11:14 PM IST
Mysore Pak Recipe In Telugu: టేస్టీ మైసూర్ పాక్‌లను కేవలం ఇలా 15 నిమిషాల్లో ఇంట్లోనే తయారు చేసుకోండి..

Mysore Pak Recipe In Telugu: మైసూర్ పాక్ పేరు వినగానే నోరూరుతుంది. కమ్మనైన రుచిని కలిగిన ఈ మైసూర్ పాక్ ను అందరూ శనగపిండితో తయారు చేస్తారు. ముఖ్యంగా ఇది దక్షిణ భారతదేశంలో కంటే ఎక్కువగా ఉత్తరాదిన ప్రాచూర్యం పొందిన రెసిపీ. ప్రతి పండగలో భాగంగా తప్పకుండా ఈ మైసూర్ పాక్ ను తయారు చేసుకొని తినడం భారతీయులకు పూర్వికుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనిని తయారు చేసుకునే క్రమంలో తీపి కోసం చాలామంది చక్కెరతో పాటు బెల్లాన్ని కూడా వినియోగిస్తారు.

ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ స్వీట్ షాపుల్లో బెల్లంతో తయారుచేసిన మైసూర్ పాక్‌లే కనిపిస్తాయి. అయితే తెలంగాణలో మాత్రం ఈ మైసూర్ పాక్‌లను కొన్ని స్వీట్ షాపులు బెల్లంతో పాటు నెయ్యిని ఎక్కువగా వినియోగించి తయారు చేస్తున్నాయి. నెయ్యితో తయారుచేసిన ఇవి ఎంతో రుచిని కలిగి ఉంటాయి. అయితే మీరు కూడా ఇంట్లోనే సులభంగా మైసూర్ పాక్ ను తయారు చేసుకోవాలనుకుంటున్నారా మీ కోసం మేము సులభమైన పద్ధతిని పరిచయం చేయబోతున్నాం.

మైసూర్ పాక్ కు కావలసిన పదార్థాలు:
✽ శనగపిండి (Bengal gram flour) - 1 కప్పు
✽ పంచదార (Sugar) - 3 కప్పులు 
✽ నెయ్యి (Ghee) - 1 కప్పు 
✽ నూనె (Oil) - తగినంత 
✽ బేకింగ్ సోడా (Baking soda) - చిటికెడు
✽ ఏలకున్న పొడి (Cardamom powder) - రుచికి తగినంత

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

తయారు చేసే విధానం (Instructions):
✽ ముందుగా ఒక బాణలి తీసుకుని అందులో పంచదార వేసి,  కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి.
✽ ఆ తరువాత పంచదారను బాగా కరిగించి ఓ 15 నిమిషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది. ఇలా ఉడికించిన తర్వాత, శనగపిండిని కలుపుకోవాలి.
✽ ఇలా శనగపిండిని వేసుకున్న తర్వాత ఎంతో జాగ్రత్తగా ఉండలు లేకుండా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. దాదాపు 15 నిమిషాల పాటు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
✽ మరో పొయ్యి కళాయి పెట్టుకొని అందులో నెయ్యి నూనెను పోసుకొని బాగా వేడి చేయాల్సి ఉంటుంది. ఇలా వాటి రెండింటిని దాదాపు 5 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి.
✽ ఇప్పుడు నెయ్యి, నూనె మిశ్రమాన్ని శనగపిండి ఉన్న బాణలిలో కొంచెం కొంచెం వేస్తూ,  బాగా కలుపుతూ ఉండాలి.
✽ పాకం, పిండి బాగా వేగి, చిల్లులు పడుతూ కనిపించినప్పుడు, బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలుపుకుని వేయాలి.
✽ మిగిలిన నెయ్యి కూడా వేసి,  బాగా రెండు, మూడు నిమిషాలు కలపాలి.
✽ తర్వాత ఒక పళ్లెంలో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పోసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
✽ ఆ తర్వాత పళ్లెంలో పోసుకున్న మిశ్రమం చల్లారాక, మీకు నచ్చిన విధంగా మొక్కలను కట్ చేసుకుంటే.. అంతే రుచికరమైన మైసూర్ పాక్ రెడీ!

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News