Kubera: కొత్త ప్రయోగం చేస్తున్న శేఖర్ కమ్ముల.. కుబేర కథ ఇదేనా!

Shekhar Kammula: ధనుష్ – నాగార్జున కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వ తీరుకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని ఈ చిత్ర నుంచి ఈ మధ్య విడుదలైన మొదటి లుక్ చూస్తే అర్థమవుతుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2024, 04:05 PM IST
Kubera: కొత్త ప్రయోగం చేస్తున్న శేఖర్ కమ్ముల.. కుబేర కథ ఇదేనా!

Kubera Story: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే సినిమాలకు చాలా స్పెషాలిటీ ఉంటుంది. మన మధ్య జరిగే చిన్న చిన్న సందర్భాలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. ఇప్పుడు అతని దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్.. కింగ్ నాగార్జున కాంబినేషన్లో ఓ భారీ మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని కూడా రివీల్ చేశారు. ఈ మూవీకి కుబేర అనే టైటిల్ ని లాక్ చేస్తూ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ పోస్టర్ లో మాసిన గడ్డంతో.. పాత దుస్తులతో ఉన్న ధనుష్ వెనుక శివపార్వతుల చిత్రపటం ఆడియన్స్ లో ఆసక్తి రేపుతోంది. అయితే ఈ బ్యాక్ డ్రాప్ ఏదో ఆషామాషీగా అలా సెట్ చేసింది కాదు.. బ్యాక్ డ్రాప్ వెనుక చాలా పెద్ద కథ ఉందట. మూవీ టైటిల్ కుబేర.. మన పురాణాల ప్రకారం కుబేరుడు దేవతలకి కూడా అప్పు ఇచ్చేటంత ఐశ్వర్యవంతుడు. అయితే అతను అందగాడు మాత్రం కాదు. ధనుష్ పాత్ర డిజైన్ చేయడం కోసం శేఖర్ కమ్ముల కుబేరుడి పూర్వజన్మ గా పురాణాల్లో చెప్పే గుణనిధి పాత్రను రెఫరెన్స్ కి తీసుకున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.

 గుణనిధి ఒక బ్రాహ్మణ వంశానికి చెందిన వ్యక్తి. అయితే కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలి అని ఆశతో అతను వ్యసనాలకు,  దొంగతనాలకు అలవాటు పడతాడు. తాను జూదం ఆడుతున్నాడు అన్న విషయం తండ్రికి తెలియడంతో.. ఏం చేస్తాడో అని భయపడి కట్టు బట్టలతో పారిపోయిన గుణనిధి ఓ శివాలయంలో తలదాచుకుంటాడు. భయంతో అక్కడ ఆ రోజు అతను జాగారం చేస్తాడు. కాలుజారిన గుణనిధి తల నంది విగ్రహానికి కొట్టుకోవడంతో అతను చనిపోతాడు. జాగారం చేసిన ఫలితం దక్కడంతో కృతయుగం లో అతను కుబేరుడు గా మళ్ళీ పుడతాడు.

కుబేరుడు మహాశివ భక్తుడు కావడంతో.. అతని తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ఎన్నో అద్భుతమైన వరాలను ఇస్తాడు. శేఖర్ కమ్ముల కుబేర చిత్రంలో ధనుష్ పాత్రను ఈ రెండు నేపథ్యాలను ఉపయోగించి క్రియేట్ చేశారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం 1990 కాలంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఓ బిచ్చగాడి స్టోరీ తో ముందుకు సాగుతుంది. ఇందులో ధనుష్ ని వెంటాడే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు .ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం మరొక ప్లస్ పాయింట్ అని ఫిలింనగర్ టాక్.మొత్తానికి ఈ మూవీతో శేఖర్ కమ్ముల భారీ ప్లానింగ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్‌ జగన్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News