/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Red Rice Health Benefits: సాధారణంగా మన అందరి ఇళ్లలో వైట్ రైస్ తింటారు. మరికొందరు ఆరోగ్య స్పృహ ఉన్నవారు బ్రౌన్ రైస్ తింటారు. ఇక వైట్ రైస్ మనం ఎక్కువగా చూసే, తినే ఆహారం. అయితే, ఇందులో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మన రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ వైట్‌ రైస్‌కు దూరంగా ఉంటారు. అందుకే చాలామంది బ్రౌన్‌ రైస్ తినడం కూడా ప్రారంభించారు. కానీ, మీరు ఎప్పుడైన రెడ్‌ రైస్‌ పేరు విన్నారా? దీంతో ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా? ఆ వివరాలు తెలుసుకుందాం..

ఈ భూమిపై ఎన్నో రకాల వరి పంటను పండిస్తారు. అయితే, మన ఆసియా ఖండంలో వరి ప్రధానం. ఇందులో కొన్ని రకాల వరిపంటలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటున్న నేపథ్యంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందులోనే రెడ్‌ రైస్ కూడా ఒకటి. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చూడటానికి కూడా కాస్త మందంగా కనిపిస్తాయి. కానీ, అన్ని సూపర్‌ మార్కెట్లలో సైతం ఇవి ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 

రెడ్ రైస్ ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు రెడ్ రైస్ వారి డైట్లో చేర్చుకోవాలి. రెడ్ రైస్‌లో థాయ్ రెడ్‌ రైస్, హిమాలయన్ రైస్ ఉంటాయి. అయితే, వైట్ రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లు రెడ్‌ రైస్‌లోనే ఉంటాయి. ఆంథోసైనిన్, మైర్సెటిన్ ఉంటాయి. ముఖ్యంగా ప్రీరాడికల్స్ అంటే గుండె జబ్బులు, డయాబెటిస్ కారణం, ఇది రాకుండా నివారించడానికి రెడ్‌ రైస్ కు మించింది ఏది లేదని కొన్ని పరిశోధనల్లో తేలింది. 

ఇదీ చదవండి: మహిళలు ఈ పండు తింటే చాలు.. వారికి UTI సమస్య దరిచేరదు..

రెడ్ రైస్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి. ఇందులో ఆంథోసైనిన్ మన ముఖాన్ని హానికర అతినీలలోహిత కిరణాల నుంచి రక్తిస్తుంది. దీంతో త్వరగా వృద్ధాప్యాం రాకుండా నివారించవచ్చు.

ఇదీ చదవండి: ఈ 6 లక్షణాలు కనిపిస్తే గుండెపోటే..! ఏం చేయాలంటే..?

అయితే, రెడ్‌ రైస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా ఇది పొట్టను సైతం సులభంగా శుభ్రం చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఈ రైస్ తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రైస్ రోజుకు సరిపడా శక్తిని సైతం ఇస్తుంది. ముక్యంగా కేన్సర్, ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు వ్యాధుల ప్రమాదం కూడా ఈ రైస్ తిన్నవారికి తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ రైస్ లో మెగ్నిషియం ఉంటుంది. దీంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి మందు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

Section: 
English Title: 
Many diseases are cured with red rice and it repairs every organ of the body rn
News Source: 
Home Title: 

Red Rice Health Benefits: ఎర్రబియ్యంతో ఎన్నో రోగాలు మాయం.. ఈ రైస్ ప్రతి అవయవాన్ని రిపెయిర్ చేస్తుంది..

Red Rice Health Benefits: ఎర్రబియ్యంతో ఎన్నో రోగాలు మాయం.. ఈ రైస్ ప్రతి అవయవాన్ని రిపెయిర్ చేస్తుంది..
Caption: 
Red Rice Health Benefits
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఎర్రబియ్యంతో ఎన్నో రోగాలు మాయం.. ఈ రైస్ ప్రతి అవయవాన్ని రిపెయిర్ చేస్తుంది
Renuka Godugu
Publish Later: 
No
Publish At: 
Friday, March 29, 2024 - 08:35
Created By: 
Renuka Godugu
Updated By: 
Renuka Godugu
Published By: 
Renuka Godugu
Request Count: 
14
Is Breaking News: 
No
Word Count: 
289