Iron Rich Foods: ఆధునిక జీవన శైలిలో బిజీ లైఫ్ కారణంగా ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండటం లేదు. అంతకుమించి హెల్తీ ఫుడ్స్ తినకపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యంగా ఎనీమియా సమస్య తలెత్తుతోంది. ఈ క్రమంలో డైట్‌లో కొన్నిరకాల ఫుడ్స్ ఉండేట్టు చూసుకుంటే చాలా సమస్యలు దూరమౌతాయి. ఎనీమియా సమస్య ఇట్టే దూరం చేయవచ్చు.
గుడ్లు గుడ్లతో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ కొరత తీర్చేందుకు గుడ్లు బెస్ట్ పుడ్ అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఐరన్, కాల్షియం కావల్సినంతగా లభిస్తాయి.
రెడ్ మీట్ రెడ్ మీట్‌లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వారంలో ఓసారి తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అద్బుతంగా పెరుగుతాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, జింక్, ఐరన్, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి.
తృణ ధాన్యాలు తృణ ధాన్యాలను డైట్‌లో తప్పకుండా చేర్చుకోవాలి. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచేందుకు తృణ ధాన్యాలు చాలా అవసరం.
డ్రై ఫ్రూట్స్ శరీరంలో రక్త హీనత సమస్య దూరం చేయాలంటే హెల్తీ ఫుడ్స్ చాలా అవసరం. దీనికోసం డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి రోజుకు కావల్సిన ఐరన్ కావల్సినంత లభిస్తుంది. ఉదయం వేళ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
ఆకు కూరలు శరీరంలో రక్తహీనత ఏర్పడితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. శరీరంలో రక్త హీనత దూరం చేసేందుకు రోజూ డైట్‌లో ఆకు కూరలు ఉండేట్టు చూసుకోవాలి. వీటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.