డీఎస్సీ పరీక్షల సవరించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 24 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలో డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా, డీఎస్సీ పరీక్షలను ఆన్ లైనులోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత రిలీజ్ చేసిన షెడ్యూల్లో స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు, పీజీటీల పరీక్షల రోజునే కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయ పరీక్షలు కూడా ఉండడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయానికి అనుగుణంగా నూతన షెడ్యూల్ విడుదల చేశారు.
కొత్త షెడ్యూల్ ప్రకారం వివరాలు ఇవే
*హాల్టిక్కెట్ల డౌన్లోడ్ సదుపాయం: డిసెంబరు 10 నుండి
*స్కూలు అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజ్) పరీక్షలు: డిసెంబరు 24, 26, 27 తేదిలు
*స్కూలు అసిస్టెంట్ (లాంగ్వేజ్): డిసెంబరు 28
*పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు: డిసెంబరు 29
*ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు: డిసెంబరు 30 నుంచి జనవరి 1
*ప్రధానోపాధ్యాయులు, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్ టీచర్లు: జనవరి 2
*భాషాపండితులు: జనవరి 3
*సెకండరీ గ్రేడ్ టీచర్లు: జనవరి 18 నుంచి 30 వరకు