ముగిసిన ఎన్నికల ప్రచారం; మీడియాతో ఆలోచనలు పంచుకున్న మహాకూటమి నేతలు

ముగిసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో మహాకూటమి నేతలు మీడియాతో తమ ఆలోచనలు పంచుకున్నారు.

Last Updated : Dec 5, 2018, 05:21 PM IST
ముగిసిన ఎన్నికల ప్రచారం; మీడియాతో ఆలోచనలు పంచుకున్న మహాకూటమి నేతలు

ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో మహాకూటమి నేతలు ఒకే వేదికపై వచ్చి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ, చంద్రబాబు, సురవరం సుధాకర్ రెడ్డి  సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ,  కోదండరాం, చాడా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశంలో మహాకూటమి నేతలు కేసీఆర్ పాలనపై విమర్శలు సంధించారు. మహాకూటమి ఏర్పడటానికి గత కారణాలు వివరిస్తూ అధికారంలోకి వస్తే ఏం చేయలదల్చుకున్నారో కూటమి నేతలు ప్రజలకు వివరించారు.

ప్రజల కలల్ని సాకారం చేస్తాం -రాహుల్

మహాకూటమి మీడియా సమావేశంలో కేసీఆర్ పాలనపై రాహుల్ విమర్శలు సంధించారు. ప్రధాని మోడీ గూడఛారిగా కేసీఆర్ వ్యహరిస్తున్నారని విమర్శించారు. మహాకూటమిని ఏర్పాటు చేసి ప్రచారం చేయడం ద్వారా కేసీఆర్ అరాచకాలను తెలంగాణ ప్రజలకు వివరించగలిగామని రాహుల్ పేర్కొన్నారు. కేసీఆర్ నియంత పాలను నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఓ ప్రయత్నం చేశామన్నారు. మహాకూటమి తెలంగాణ ప్రజల ఆంక్షాలను బయటిప్రపంచానికి తెలిపిందన్నారు.  వచ్చే ఎన్నికల్లో తాము తప్పకుండా అధికారంలోకి వస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రుణమాఫీ చేసి రైతులకు భరోసా కల్పిస్తామన్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రజల కలల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా రాహుల్ భరోసా ఇచ్చారు. ఇక సీఎం అభ్యర్ధి విషయంలో ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు.

దేశంలో మార్పునది ఇదే ఆరంభం- చంద్రబాబు

ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రజల భవితవ్యాన్ని తేల్చనున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నియంత పాలన గురించి మహాకూటమిలోని నేతలందరూ కలిసి ప్రజలకు వివరించామన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలపై ఉందన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చుతామని ప్రజలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు

తెలంగాణ ప్రజల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు - కోదండరాం
తెలంగాణ ఏర్పడితే ప్రజలు బతుకులు బాగుపడతాయిన పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కోదండరాం పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రజల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యపునరుద్దరణ జరగాల్సి ఉందని..అందుకే మహాకూటమిలో కలిసి ప్రచారం చేశామని కోదండరాం వివరణ ఇచ్చారు.  మన ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజలకు ఏమీ చేయలేదని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దాలన్నీ కేసీఆర్ విస్మరించారని కోదండరాం విమర్శించారు

Trending News