Telangana Elections: తెలంగాణ పోలింగ్ వివరాలను వెల్లడించిన ఈసీ

                    

Last Updated : Dec 7, 2018, 09:29 PM IST
Telangana Elections: తెలంగాణ పోలింగ్ వివరాలను వెల్లడించిన ఈసీ

తెలంగాణ పోలింగ్ వివరాలను ఎన్నికల ప్రధానాధికారి రజత్ కమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం 5 గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. పోలింగ్ గడువు ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న అభ్యర్ధులు ఓట్లను కూడా లెక్కించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ భేష్

రాష్ర్టంలోని సమస్యాత్మక 13 నియోజకవర్గాల్లో 74 శాతం పోలింగ్ నమోదు అయిందని పేర్కొన్నారు. అత్యిధికంగా నర్సంపేటలో 84 శాతం, ఆలేరు 83.02 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. అత్యల్పంగా యాకుత్ పురలో 33 శాతం పోలింగ్ నమోద అయినట్లు రజత్ కుమార్ తెలిపారు. 

ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చేసిన వివిధ తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నగదు, లిక్కర్ కలిపి మొత్తం 137.96 కోట్లు సీజ్ చేశామన్నారు. ఈ సారి ఎక్కడా బెల్టు షాపులు నిర్వహించడం.. గుడుంబా అమ్మకాల గురించి ఫిర్యాదులు అందలేదని తెలిపారు.

జర్నలిస్టుల ఫిర్యాదులపై విచారణ

ఓట్ల గల్లంతుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా రతజ్ కుమార్ వెల్లడించారు. కొన్ని చోట్ల ఓట్ల గల్లంతు నిజమేమని..బోగస్ ఓట్ల గురించి రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని వెల్లడించారు. అలాగే విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల పట్ల పోలీసులు దుసురుగా ప్రవర్తించారని ఫిర్యాదులు అందాయి. పోలీసుల తప్పుంటే మెమో జారీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా రీపోలింగ్  అభ్యర్ధనలు రాలేదని ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించారు.

Trending News