Sabari Movie Review: 'శబరి'గా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించిందా.. ?

Sabari Movie Review: వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చాలా యేళ్ల తర్వాత  కథానాయికగా నటించిన సినిమా 'శబరి'. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ హిట్ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2024, 12:38 PM IST
Sabari Movie Review: 'శబరి'గా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించిందా.. ?

రివ్యూ: శబరి (Sabari)
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపీ, రాజశ్రీ నాయర్, మధునందన్, సునయన, బేబి నివేక్ష తదితరులు
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టి
ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల  
సంగీతం: గోపీచందర్  
నిర్మాత: మహేంద్ర నాథ్
దర్శకత్వం: అనిల్ కాట్జ్
విడుదల తేది: 3-5-2024

కథ విషయానికొస్తే..
సంజన (వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్ (గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబైలో ఉంటారు. వీరికో కూతురు (బేబి నివేక్ష) ఉంటుంది. అనుకోని కారణాలతో భర్తతో విభేదించి విశాఖ పట్నం వెళుతుంది. అక్కడ ప్రైవేటు ఉద్యోగంలో చేరుతుంది. అక్కడ నగరానికి దూరంగా ఓ ఇంట్లో కూతురితో ఉంటుంది. అక్కడ సంజనకు అనుకోని సంఘనలు చోటుచేసుకుంటాయి. తన కూతురు కిడ్నాప్‌కు అవుతోంది. అపహరణకు గురైన బిడ్డను ఎలా వెతికి పట్టుకుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.  దాన్ని ఎలా పరిష్కరించకుంది. ఈ క్రమంలో తను భర్తతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. చివరకు కూతురు కోసం సంజన ఏం చేసిందనేది తెలియాలంటే 'శబరి' మూవీ చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి కథ, కథనంతో పాటు అందులో నటీనటుల నటన కూడా ఇంపార్టెంట్. ఇక దర్శకడు తాను ఎంచుకున్న కథకు వరలక్ష్మి శరత్ కుమార్ ఎంచుకోవడంతో సగం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఊహించని ట్విస్టులో ఈ సినిమాను చివరి వరకు అదే టెంపోను మెయింటెన్ చేయడంతో సక్సెస్ అయ్యాడు. లాజిక్ సంగతి పక్కన పెడితే.. తెలుగులో గతంలో ఇలాంటి తరహా చిత్రాలు వచ్చినా..ఈ సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. కన్నబిడ్డ కోసం తల్లి పడే ఆరాటం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు.

ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ.. వాళ్ల ప్రేమకు గుర్తుగా పాప..ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగినా.. సెకండాఫ్‌లో ట్విస్టులో కథను పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత రొటిన్‌గా అనిపించినా.. ప్రీ క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు ఆయువుపట్టు అని చెప్పొచ్చు. ఈ సినిమాకు గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫోటోగ్రఫీతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే..
వరలక్ష్మి శరత్ కుమార్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరోసారి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. బేబి నివేఓ కూడా తన పాత్రలో చక్కగా నటించింది.. గణేష్ వెంకట్రామన్ తన క్యారెక్టర్ మేరకు ఓకే అనిపించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

ఇదీ చదవండి: ఎండలా.. నిప్పులా కొలిమా.. ? పలు రికార్డులు బద్దలు కొడుతున్న ఉష్ణోగ్రతలు..

ప్లస్ పాయింట్స్

కథనం

వరలక్ష్మి శరత్ కుమార్ నటన

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్

అర్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలు

ఎడిటింగ్

ట్యాగ్ లైన్.. ట్విస్టులతో మెప్పించే 'శబరి'

రేటింగ్.. 2.75/5

ఇదీ చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News