Maruti Suzuki Wagon-r Electric Car Model 2025: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలోనే ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కంపెనీ అతి త్వరలోనే తమ కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. మారుతి తమ మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారును eWX కాంపాక్ట్ SUV అనే పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ 2025 సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయితే Tata Tiago EVతో పోటీపడుతుందని మార్కెట్లో టాక్ జోరుగా సగుతోంది. ఈ మోడల్‌ను గత నెల 2024 బ్యాంకాక్ మోటార్ షోలో పరిచయం చేసింది. అంతేకాకుండా ఈ కారుకు సంబంధించిన డిజైన్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.
మారుతి సుజుకి ఈ eWX మోడల్ చూడడానికి వ్యాగన్ఆర్ కారులా కనిపిస్తుంది. అలాగే ఇటీవలే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ కారు 1,620 mm ఎత్తును కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 3,395 mm పొడవు, 1,475 mm వెడల్పుతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ Suzuki eWX కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 230కిమీల వరకు మైలేజీ సామర్థ్యంతో రాబోతోంది. ఈ కారు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ కారు సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే, ఈ ఎలక్ట్రిక్ కారుకు పొడవైన కిటికీలు ఉంటాయి. అంతేకాకుండా వాటికి ఆకర్శనీయమైన అద్దాలు కూడా ఉంటాయి. అలాగే ఎంతో ఆకర్శనీయమైన అల్లాయ్ వీల్స్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ కారుకు సంబంధించన ఇంటీరియర్ విషయానికొస్తే, ఇది లోపల గ్రీన్ థీమ్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు MG కామెట్ లాగా సీట్స్, లాంగ్ టచ్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో స్పీడోమీటర్‌తో పాటు ఇన్ఫోటైన్మెంట్స్ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ Suzuki eWX ఎలక్ట్రిక్ కారు సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం ఒకే ఒక సారి ఛార్జ్ చేస్తే దాదాపు 230 కిమీల రేంజ్ వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఈ కారు అతి శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే, ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై దాదాపు రూ.12 లక్షల లోపు లభించే ఛాన్స్ ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి