ఈడీ ముందు సోనియా అల్లుడు; వాద్రపై ప్రశ్నల వర్షం

మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఎంఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. బుధవారం ఈడీ అడిగిన 40 ప్రశ్నలకు జబాబు ఇచ్చిన వాద్ర..ఈ రోజు కూడా ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కేసుకు  వాద్రాకు సంబంధించి ఈడీ అదికారులు ప్రశ్నలు సంధించారు. అక్రమమార్గంలో డబ్బును లండన్ కు తరలిస్తున్నారని వాద్రా అభియోగాలు ఎదురుకుంటున్నారు. 

Last Updated : Feb 7, 2019, 12:31 PM IST
ఈడీ ముందు సోనియా అల్లుడు; వాద్రపై ప్రశ్నల వర్షం

ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఎంఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. బుధవారం ఈడీ అడిగిన 40 ప్రశ్నలకు జబాబు ఇచ్చిన వాద్ర..ఈ రోజు కూడా ఈడీ ముందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో కేసుకు  వాద్రాకు సంబంధించి ఈడీ అదికారులు ప్రశ్నలు సంధించారు. అక్రమమార్గంలో డబ్బును లండన్ కు తరలిస్తున్నారని వాద్రా అభియోగాలు ఎదురుకుంటున్నారు. 

ఆయుధ వ్యాపారీ సంజయ్ బండారీ కేసు విచారణతో  వాద్రా పేరు బయటకు వచ్చింది. వాద్రాకు సంబంధించి స్కైలైట్ హాస్పటాలిటీ ఉద్యోగి మరోజ్ అరోరాను గతంలో ప్రశ్నించిన ఈడీ...మనోజ్ లండన్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఖరీదైన భవంతులు కొనుగోలు చేసినట్లు ఈడీ చెబుతోంది. దీనికి సంబంధించిక కీలక ఆధారాలు ఉన్నాయని..ఈ కేసులో వాద్రాకు ప్రమేయం ఉందని..పక్కా ఆధారాలతో ఆయన్ను ప్రశ్నిస్తున్నామని ఈడీ పేర్కొంటుంది.

రాబట్ వాద్రా మరోరకంగా వాదిస్తున్నారు. ఇంతదా కట్టు కథ అని..తనకు లండన్ లో ఎలాంటి ఆస్తులు లేవన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. ఈడీ విచారణకు సహకరిస్తామని ఆయన తరఫున న్యాయవాది వాదిస్తున్నారు. ఈ విషయంలో మోడీ సర్కార్ కుట్ర ఉందని వాద్రా భార్య ప్రియంకా గాంధీ ఆరోపిస్తున్నారు. మోడీ సర్కార్ అధికార దుర్వినియోగం చేస్తోందని ..తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని సమర్ధిస్తున్నారు. రాజకీయం ఎదుర్కొకలేకనే తమపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారనిప్రియాంక విమర్శించారు. 

 

 

Trending News