Astrology effect: జ్యోతిష్య పండితుల ప్రకారం మనం నిత్య జీవితంలో చేసే ప్రతిపని కూడా మనకు పాజిటివ్, నెగెటివ్ ఫలితాలను కల్గజేస్తాయి. అందుకు మంచి పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.
చాలా మంది ఉదయం, సాయంత్ర రెండు పూటల్లో స్నానాలు చేస్తుంటారు. ఆఫీసులకు వెళ్లేటప్పుడు చేస్తుంటారు. ఆ తర్వాత ఇంటికి అలసిపోయిన వచ్చాక కూడా స్నానంచేసి సేదతీరుతుంటారు. ఇదిలా ఉండగా.. బాత్రూమ్ లో స్నానంచేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కొందరు వేడినీళ్లతోను మరికొందరు చల్లని నీళ్లతోనుస్నానం చేస్తుంటారు. కానీ బాత్రూంలో స్నానం చేసేటప్పుడు మాత్రం ఒంటిమీద ఏవైన బట్టలు ఉండేలా చూసుకొవాలని పండితులు చెబుతున్నారు.
ఒంటి మీద నూలు పోగు కూడ లేకుండా స్నానంచేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల వరుణ దేవుడికి కోపం వస్తుందంట. అందుకే ఎట్టిపరిస్థితుల్లో కూడా పూర్తిగా నగ్నంగా స్నానం చేయకూడదంట.
బాత్రూమ్ లో నగ్నంగా స్నానంచేస్తే.. జీవితంలో అశాంతి, ధన నష్టం కలుగుతాయంట. ఎంత కష్టపడిన సరైన విధంగా గుర్తింపు ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకు స్నానంచేసేటప్పుడు పై నియమాలను తప్పకుండా పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
చిన్న పిల్లలకు కూడా స్నానం చేయించేటప్పుడు కనీసం చిన్న టవర్ ముక్క అయిన ఆఛ్చాదనగా ఉంచాలని పండితులు చెబుతున్నారు. నగ్నంగా స్నానం చేయడం వల్ల గాలి సోకడం, చెడు ప్రభావం ,కన్ను పడటం వంటివి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)